Begin typing your search above and press return to search.

24న వైట్ల మెగా ట్రీట్‌

By:  Tupaki Desk   |   22 Sept 2015 11:03 PM IST
24న వైట్ల  మెగా ట్రీట్‌
X
పుట్టినరోజు వేడుకల్ని ప్రచారానికి ఉపయోగించడం పరమ రొటీనే. హీరో - డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవరు పుట్టినా ప్రచారమే. బర్త్డే కేక్ లు - అవి కట్ చేయడాలు సందడి చేయడాలు మామూలే. ఇవన్నీ సినిమా ప్రచారానికి ఉపయోగపడేవే కాబట్టి ప్రాధాన్యత ఎక్కువ. ఈ నెల 24న శ్రీనువైట్ల పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడు హైదరాబాద్ బ్లూఫాక్స్(పీవీఆర్)లో మీడియా మీట్ ఏర్పాటు చేశాడు. ఈ మీట్ లో బ్రూస్ లీ విశేషాల్ని వెల్లడించనున్నాడు.

ఈ మీట్లో పుట్టినరోజు విశేషాలతో పాటు మరిన్ని అప్ డేట్స్ చెబుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే శ్రీను పుట్టినరోజున బ్రూస్లీ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ గురువారం నాడు సాంగ్ చెర్రీ అభిమానుల ముందుకు రాబోతోంది. ఓవైపు చరణ్ డైరెక్టర్ పుట్టినరోజు ట్రీట్.. మరోవైపు బ్రూస్ లీ సాంగ్ తో విజువల్ ట్రీట్.. మెగాభిమానుల్ని అలరించబోతున్నాయి. అదేరోజు శ్రీను బ్రూస్ లీ రిలీజ్ డేట్ని కన్ఫమ్ చేస్తాడేమో వేచి చూడాల్సిందే.

శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు. చరణ్ సరసన రకూల్ ప్రీత్ కథానాయికగా ఆడిపాడుతోంది. మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా కంటే ముందే అభిమానులకు ఈ చిత్రంలో కనిపించి ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా వైట్ల కెరీర్ కి ఓ ఛాలెంజ్ లాంటిది. రిలీజ్ తర్వాత సక్సెస్ తో అసలైన పుట్టినరోజు చేసుకుంటాడేమో చూడాలి.