Begin typing your search above and press return to search.
శ్రీనువైట్ల మళ్లీ ఫార్మాట్ మారుస్తాడా?!
By: Tupaki Desk | 12 Oct 2015 9:42 AM GMTఒకే ఫార్ములాతో సినిమాలు అన్న విమర్శని మళ్లీ వినకూడదని శ్రీనువైట్ల డిసైడైయ్యాడా? ఇక నుంచి తరచుగా ఫార్మాట్ లు మారుస్తూ సినిమాలు తీయబోతున్నాడా? ఆయన మాటల్నిబట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది. `ఢీ` - `రెఢీ` మొదలు శ్రీనువైట్ల ఎప్పుడూ తెరపై అబద్ధపు కథల్ని చూపిస్తూ వచ్చారు. కామెడీని కూడా ట్రాక్ లుగా పెడుతుంటాడు. హీరో ఇంట్లో విలనో లేక విలన్ ఇంట్లో హీరోనో ఇలా ఏదో ఒక కంగాళీతో కథని నడుపుతుంటాడు. `దూకుడు` వరకు ఆ ఫార్మాట్ బాగానే పనిచేసింది. `ఆగడు`తో పెద్దయెత్తున విమర్శలొచ్చాయి. కామెడీ ట్రాక్ లు - డైలాగుల మీద పంచ్ లు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి. దీంతో వెంటనే శ్రీనువైట్ల ఫార్మాట్ ఛేంజ్ చేసి `బ్రూస్ లీ` తీశాడు. ఎంటర్ టైన్ మెంట్ కోసం కథ కాకుండా... కథ కోసమే ఎంటర్ టైన్ మెంట్ ని పుట్టించి ఈ సినిమాని తీశాడు. అందుకే శ్రీనువైట్ల ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఆగడుతో తాను ఏం పోగొట్టుకొన్నాడో బ్రూస్‌లీతో అది దక్కించుకొంటానన్న నమ్మకంతో కనిపిస్తున్నాడు. అయితే బ్రూస్‌లీ ఫార్మాట్ ని మాత్రం మళ్లీ కంటిన్యూ చేయడట. ఇక నుంచి ఎప్పటికప్పుడు కథల తీరును మారుస్తుంటాడట. సోమవారం హైదరాబాద్ లో ఆయన విలేకర్లతో ముచ్చటిస్తూ ఇదే విషయాన్ని చెప్పాడు. తదుపరి సినిమాని కూడా ఓ లవ్ ట్రాక్ తో నడపాలని ఆయన కథ రాసుకొంటున్నాడట. శ్రీనువైట్ల నుంచి ప్రేమకథ అంటే కొత్తగానే ఉంటుంది మరి! ఆ తర్వాత కూడా ఫాంటసీ, చారిత్రాత్మక కథలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. ``ఎప్పట్నుంచి డిఫరెంట్ సినిమాలు చేయాలన్న ఆలోచన నాకూ ఉంది. అయితే సమయం కుదరాలి. ఎప్పుడో ఒకసారి నేను కూడా ఫాంటసీ, హిస్టరీ స్టోరీలు తీస్తా`` అని చెబుతున్నాడు.