Begin typing your search above and press return to search.

ఫిక్స్ : వైట్ల - చరణ్ సినిమాలో చిరు

By:  Tupaki Desk   |   20 Aug 2015 1:04 PM GMT
ఫిక్స్ : వైట్ల - చరణ్ సినిమాలో చిరు
X
గతకొంత కాలంగా వినిపిస్తున్న బలమైన పుకారు అనబడే వాస్తవం నేడు అధికారికంగా ప్రకటించబడింది. రామ్ చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లో మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే దర్శకుడు శ్రీనువైట్ల తన ట్విట్టర్ అకౌంట్ లో అధికారికంగా ప్రకటించారు.

చిరంజీవి తమా సినిమాలో నటించడం తమకి గర్వకారణమని పేర్కొన్నాడు. అంతేకాక సినిమా టైటిల్ మరియు విడుదల తేది వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించాడు. చిరు జన్మదినం పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదలచేయనున్నారు. దీంతో అఫీషియల్ గా చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా ఇదే కావడం విశేషం. చిరు ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తాడు అనుకున్న అభిమానుల ఆశ ఇప్పట్లో తీరేలా లేదు గాబట్టి ఈ నిర్ణయం తీసుకుని ఉండచ్చు. బాలీవుడ్ లో అమితాబ్, అభిషేక్ మాదిరి టాలీవుడ్ లో నాన్న, నేను అప్పుడప్పుడు తెరమీద కనబడాలి అని మగధీర టైం లో చెప్పిన చెర్రి మాట మరోసారి నిజమైంది.