Begin typing your search above and press return to search.
ఢీ 2 అనబోతున్న శ్రీను వైట్ల
By: Tupaki Desk | 22 Oct 2015 4:47 AM GMTఎంటర్ టైన్ మెంట్ ని మాత్రమే నమ్మి కథను ఎంపిక చేసుకోవడం ఒక పద్ధతి. కథను నమ్మి ఎంటర్ టైన్ మెంట్ ని యాడ్ చేయడం ఇంకో పద్ధతి. ఈ రెండిటిలో మొదటి పద్ధతిలోనే ఎక్కువ సక్సెస్ అయ్యానని శ్రీనువైట్ల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కథను నమ్మినప్పుడు ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయని చెప్పాడు. అది కరెక్ట్ రీజన్ అవునో కాదో తెలీదు కానీ.. ఒకటి మాత్రం నిజం. కథల ఎంపికలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా తెలుగు ప్రేక్షకులకు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాని అయినా తిరస్కరిస్తున్నారు. బ్రూస్ లీ చిత్రంతో ఇది శ్రీనువైట్లకు కూడా అనుభవమైంది. అసలు ఆ సినిమా పరాజయం శ్రీనూని నిజంగానే డైలమాలో పడేసింది.
ఆగడు ఆ వెంటనే బ్రూస్‌లీ పరమ రొటీన్ కథలతో తెరకెక్కినవే. పైగా తాను ఆశించిన ఎంటర్ టైన్ మెంట్ లో రొటీనిటీని తెలుగు జనాలు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఇలాంటి సన్నివేశంలో శ్రీనూని ఆదుకునే దేవుడు ఎవరు? అంటే మంచు విష్ణు అనే సమాధానం వినిపిస్తోంది. శ్రీనూ ఇప్పటికే ఢీ 2 కథ రెడీ చేశాడట. విష్ణు రెడీ అంటే సెట్స్‌కి వెళ్లడమే లేటు అంటున్నారు. పలు సందర్భాల్లో విష్ణుతో ఢీ2 చేయాలనుందని శ్రీనువైట్ల చెప్పాడు కాబట్టి అందుకు మంచు వారబ్బాయి కూడా ప్రిపరేషన్ లోనే ఉండి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తను నమ్ముకున్న ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చే కథాంశంతోనే శ్రీనూ ఢీ2 తెరకెక్కిస్తాడనడంలో సందేహమే లేదు. కాని మళ్లీ సేమ్ పాత చింతకాయ్ పచ్చడేనా??