Begin typing your search above and press return to search.
రైటర్లకే వైట్ల క్రెడిట్ ఇచ్చారే!
By: Tupaki Desk | 12 Nov 2018 4:49 AM GMTతమకు క్రెడిట్ ఇవ్వకుండా కథల్ని కొట్టేస్తున్నారని.. తమ ప్రతిభను దోచుకుని కేవలం ఘోస్ట్ రైటర్లుగానే పరిమితం చేస్తున్నారని స్టార్ డైరెక్టర్లు - సీనియర్ రచయితల విషయంలో యువతరం రచయితలు ఫిర్యాదులు చేసిన సందర్భాలెన్నో. ఈ తరహా వివాదాలెన్నో ఇండస్ట్రీలో బయటపడుతున్నాయి. స్టార్ డైరెక్టర్లే కథలు కొట్టేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నిరూపణ కూడా అయ్యాయి. దర్శకులు యువ రచయితల దగ్గర కథలు కొట్టేయడం మాట అటుంచితే స్టార్ రైటర్ అయిన కోన వెంకట్ అంతటి వారే.. తనకు ఎంతో గొప్ప స్నేహితుడు అయిన శ్రీనువైట్ల తనకు ద్రోహం చేశారని ఆరోపించారు. రచయితగా తనకు టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వకుండా శ్రీనునే తన ఖాతాలో వేసేసుకుంటున్నాడని అప్పట్లో పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఆ వివాదం వల్లనే ఆ ఇద్దరి మధ్యా స్నేహం చెడింది. ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. అంతకుముందు కలిసికట్టుగా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ ఇద్దరూ విడిపోయాక మాత్రం రెంటికి చెడ్డ రేవడి అయిపోయారు. రచయితలుగా ఎవరూ సక్సెస్ సాధించలేకపోవడం ఇండస్ట్రీలో చర్చకొచ్చింది.
ఆ గతం నేర్పిన పాఠాల వల్లనో ఏమో శ్రీనువైట్ల ఇప్పుడు రచయితలకు కాస్తంత గుర్తింపును ఇస్తున్నారని అర్థమవుతోంది. మొన్నటిరోజున అమర్ అక్బర్ ఆంటోని ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకించి తన రైటర్లను పేర్లు పెట్టి వేదికపైకి పిలిచారు. వారు చేసిన హార్డ్ వర్క్ ని శ్రీనూ పొగిడేశారు. ఇది వైట్లలో ఊహించని మార్పు అని భావిస్తున్నారంతా. ఒక రకంగా తన గతం అతడికి కనువిప్పు కలిగించిందని నేటితరం రచయితల్లో చర్చ సాగుతోంది. రైటర్ల శ్రమను దోచుకోవడం సరికాదు.. వారికి ఎంతమేర గుర్తింపును ఇవ్వాలో అంత మేరా ఇవ్వాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సీనియర్లు చూడాలి. లేదంటే శ్రీనూ తరహాలోనే ఏదో ఒక రోజు వివాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని మాట్లాడుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఒకసారి చెడిన తర్వాత ఇక ఆ స్నేహం సమాంతర పట్టాలపై వెళుతుంది తప్ప ఎవరైనా కలిపే ప్రయత్నం చేసినా కలవదు అని `బ్రూస్ లీ` టైమ్ లో మెగాస్టార్ చేసిన ప్రయత్నం నిరూపించింది. ఆ సినిమా కోసం రైటర్ కోనను దర్శకుడు శ్రీనూతో కలిసే ప్రయత్నం చేసినా రిజల్ట్ తెలిసిందే. మొత్తానికి ఒక పెను మార్పు సీనియర్లలో కనిపిస్తోంది. కాబట్టి నవతరం రచయితలకు మునుముందు అంతా మంచి దినాలేనని ఆశిద్దాం!!