Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: శ్రీను హిట్ల పునరాగమనం!
By: Tupaki Desk | 24 Sep 2018 4:23 AM GMTబాక్సాఫీస్ వద్ద 60 కోట్ల షేర్ తెచ్చిన బాద్ షా ఆయన. దూకుడు - బాద్ షా - వెంకీ - దుబాయ్ శీను ఒకటేమిటి కెరీర్ లో బోలెడన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. టాలీవుడ్ అగ్రహీరోలందరితో పని చేశారు. ఇతడు శ్రీనువైట్ల కాదు శ్రీను హిట్ల అని పేరు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీస్ అంతా పడి పడి నవ్వేందుకు థియేటర్లకు వెళ్లే వాళ్లు. అయితే రంగుల ప్రపంచం ఎంత వింతయినదో ఆయన విషయంలో అందరికీ కనిపించింది. డౌన్ ఫాల్ అన్న అంకానికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్ అయ్యింది. ఇక్కడ హిట్టిస్తేనే ఉంటారు. ఫట్ అయితే అంతే సంగతి. అయితే వైట్ల లాంటి సీనియర్ ని పరిశ్రమ ఎంతగానో క్షమించింది. ఫ్లాపులొచ్చినా ఓపిగ్గా అవకాశాలిచ్చి అభిమానం చాటుకుంది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు అవకాశాలు.. అయితే ఏ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మారిన ట్రెండ్ ని - ఆడియెన్ పల్స్ ని పట్టుకోలేకపోయాడు.. ఫలితం ఏంటో అందరూ చూశారు.
అయితేనేం మాస్ రాజా రవితేజ లాంటి దోస్త్ ఉండగా వైట్లకు ఇప్పుడే బెంగ లేదు. దిగులు అసలే లేదు. ఎట్టి పరిస్థితిలో వైట్లను తిరిగి ట్రాక్ లోకి తేవడమే ధ్యేయంగా రవితేజ ఒక పెద్ద ఆఫర్ ఇచ్చాడు. అలా వచ్చిన ఛాన్స్ `అమర్ అక్బర్ ఆంటోని`. రవితేజకు - వైట్లకు ఇద్దరికి ఇది ఎంతో ఇంపార్టెంట్ మూవీ. సత్తా చాటి దుమ్ము దులపాల్సిన ఎటెంప్ట్ ఇది. అయితే ఇలాంటి కీలక సమయంలో శ్రీను పాత బాణి వదిలి కొత్త బాణీలోకి వచ్చాడా? లేదా? అంటూ ప్రశ్న కూడా ఎదురైంది.
అందుకే వైట్లకి ఇది లైఫ్ లైన్ లాంటిది. ఈ సినిమాతో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. హిట్టు కొడితేనే మరో ఛాన్స్. లేదంటే ఇక ఎవరైనా నమ్మాలంటే అంత సులువేం కాదు. పైగా నమ్మి అవకాశం ఇచ్చిన స్నేహితుడి కెరీర్ కి ఎసరు వచ్చే సన్నివేశం ఉంటుంది. ఇప్పటికే అగ్రహీరోలు ముఖం చాటేశారు.. చివరికి అవకాశాల కోసం వెంటపడాల్సొచ్చింది. గతానుభవాలన్నీ చేదు అనుభవాలే. అందుకే శ్రీను వైట్ల లా ఉంటే కుదరదు... శ్రీను హిట్లలా మారి తీరాల్సిందే. శ్రీనులో ట్యాలెంటుకు కొదవేం లేదు. టెక్నిక్ కి తిరుగే లేదు. కానీ ఎక్కడో కథల ఎంపికలోనే కొట్టింది తేడా. అలానే కామెడీ సీన్స్ ని ప్రెజెంట్ చేయడంలో పాత పద్ధతి నుంచి కొత్త దనానికి అప్ డేట్ కాకపోవడం అతడి కొంప ముంచింది. అందుకే అన్నిటినీ స్టడీ చేసి - విశ్లేషించి ఈసారి కొడ్తే కుంభాన్నే కొట్టాలి అన్న కసితో వస్తున్నాడనే అభిమానులు భావిస్తున్నారు. కమాన్ వైట్ల కమాన్! అంటూ పిలుస్తున్నారు ఫ్యాన్స్. నేడు బర్త్ డే సందర్భంగా వైట్లకు అభిమానుల తరపున శుభాకాంక్షలు.