Begin typing your search above and press return to search.

మూడు ఏలను కామెడీ నిలబెడుతుందా?

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:25 AM GMT
మూడు ఏలను కామెడీ నిలబెడుతుందా?
X
ష్యుర్ షాట్ హిట్ గా రవితేజ ఫ్యాన్స్ గట్టి నమ్మకం పెట్టుకున్న అమర్ అక్బర్ ఆంటోనీ రిపోర్ట్స్ ఆశాజనకంగా లేకపోవడం మాస్ మహారాజానూ ఇబ్బంది పెట్టేదే. దర్శకుడు శీను వైట్ల నెలల తరబడి ఈ స్క్రిప్ట్ కోసం దూకుడు రేంజ్ లో కష్టపడ్డాను అని చెప్పినప్పుడు నిజమే అని నమ్మిన ప్రేక్షకులు ఓపెనింగ్స్ అయితే బాగానే ఇచ్చారు. కానీ అవి ఎంత వరకు నిలబడతాయో ఇంకో నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది. స్టోరీలో రివెంజ్ ఫార్ములా మెయిన్ పాయింట్ అయినప్పటికీ శీను వైట్ల ఎక్కువ కామెడీ మీదే ఆధారపడ్డాడు. అంతో ఇంతో మాస్ కుదురుగా థియేటర్లలో కూర్చున్నారు అంటే దానికి కారణం అదే.

అమెరికా ఎన్ ఆర్ ఐ సంఘాలను బేస్ చేసుకుని సెట్ చేసిన వాటా సంఘం అంతగా మెప్పించనప్పటికీ జూనియర్ పాల్ గా ప్రవచనాలు చెబుతూనే మరోవైపు చేతబడులు చేసే పాత్రలో సత్యకు యూనిట్ చెప్పినట్టుగా కాస్త స్పాన్ ఎక్కువే దొరికింది. మరీ భీభత్సంగా కాదు కానీ జస్ట్ ఓకే అనిపించే నవ్వులైతే పూయించాడు. ఇక రఘుబాబు-శ్రీనివాసరెడ్డి తదితరుల హాస్యం అంతగా పండలేదన్నది నిజం. అయితే రవితేజ పాత్రను విశ్లేషించే అసిస్టెంట్ గా తన టైమింగ్ తో సునీల్ కొంతవరకు టైం పాస్ అయితే చేయించాడు. దానికి తోడు టాలీవుడ్ ను ఊపేసిన డ్రగ్స్ ఇన్ వెస్టిగేషన్ విచారణ చేసిన సిట్ బృందం తరహాలో అభిమన్యు సింగ్ ద్వారా మిగిలిన కామెడీ బ్యాచ్ తో చేయించిన ప్రీ క్లైమాక్స్ కామెడీ ఒక వర్గం చేత పాస్ మార్కులు వేయించుకునేలా ఉంది.

ఓవరాల్ గా ఫైనల్ అవుట్ పుట్ నిరాశ పరుస్తోంది అనే టాక్ వచ్చింది కానీ వీకెండ్ తో పాటు టాక్సీవాలా తప్ప ఇంకే పోటీ లేని అవకాశాన్ని అమర్ అక్బర్ ఆంటోనీలు ఎంత వరకు వాడుకుంటారు అనేదాన్ని బట్టి నష్టాల శాతం తగ్గడం ఆధారపడి ఉంటుంది. మంచి కం బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని శీను వైట్ల పూర్తిగా వాడుకోవడంలో విఫలమయ్యాడు.