Begin typing your search above and press return to search.
అప్డేట్ అయ్యానంటున్న సీనియర్ డైరెక్టర్
By: Tupaki Desk | 26 Dec 2019 5:30 PM GMTసీనియర్ దర్శకులు అప్డేట్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది. రొటీన్ కథలతో పాత ఫార్మేట్ లో సినిమాలు తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసోచ్చేసింది. అందుకే పూరి జగన్నాథ్ - త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా కొట్టగా ఏదో మేజిక్ క్రియేట్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అయితే వరుస ఫ్లాపుల అనంతరం శ్రీను వైట్ల కూడా అప్డేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. గతేడాది 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో మరో సారి చేతులు కాల్చుకున్న శ్రీను వైట్ల ఈ ఏడాది గ్యాప్ తీసుకొని ఎట్టకేలకు నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేసాడు. లేటెస్ట్ గా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేసిన తప్పులు ఒప్పుకొని కొత్త కథతో కొత్తగా సినిమా తీయాలని తెలిసొచ్చిందని అన్నాడు.
ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమాకు డెబ్బై శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని మరికొన్ని రోజుల్లోనే మిగతా వర్క్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తానని తెలిపాడు. అంతే కాదు ఈ గ్యాప్ లో తన ఫ్యామిలీ కి సంబంధించి కొన్ని చేయాల్సిన పనులతో పాటు తనకున్న ప్రాపర్టీస్ పనులు కూడా పూర్తిచేసానని చెప్పాడు. సో ఈ సీనియర్ డైరెక్టర్ నిజంగానే అప్డేట్ అయి కొత్త కథతో సినిమా చేసాడా లేదా అన్నది వచ్చే ఏడాది ఎండింగ్ లోపే తేలిపోతుంది. ఒక వేళ మళ్ళీ ఓల్డ్ స్కూల్ ఫార్మేట్ నే ఫాలో అయితే మాత్రం మరో డిజాస్టర్ పలకరిస్తుంది.