Begin typing your search above and press return to search.
శ్రీను వైట్ల ఇలాంటి కథ కోసమే చూశాడట
By: Tupaki Desk | 12 March 2017 5:57 PM GMTఒకప్పుడు వరుస సూపర్ హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. ‘ఆగడు’.. ‘బ్రూస్ లీ’ సినిమాల తర్వాత బాగా డౌన్ అయిపోయాడు. చాన్నాళ్ల పాటు సినిమా లేకుండా ఖాళీగా ఉండిపోయాడు. చివరికి స్టార్లెవరూ తనతో పని చేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో స్టార్ ఇమేజ్ లేని వరుణ్ తేజ్ తో సర్దుకుపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమానే ‘మిస్టర్’. ఈ సినిమాతో తనేంటో రుజువు చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు వైట్ల. ‘మిస్టర్’ టీజర్ చూస్తే వైట్ల గత కొన్నేళ్లలో చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించింది. వైట్ల తొలి రోజుల్లో తీసిన సినిమాల తరహాలో రొమాంటిక్ టచ్ కనిపించింది ఈ టీజర్లో. తాజాగా ఈ సినిమా గురించి వైట్ల మాట్లాడుతూ చాన్నాళ్లుగా ఇఆంటి కథ కోసమే ఎదురు చూశానన్నాడు.
‘‘దర్శకుడిగా ‘మిస్టర్’ లాంటి కథ కోసం చాలా రోజుల పాటు ఎదురుచూశాను. ఎందుకంటే మంచి ఎమోషన్స్.. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్.. మ్యూజిక్.. విజువల్స్.. ఇలా చాలా అంశాలకు స్కోప్ ఉన్న కథ ఇది. ఔట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. నేనేదైతే అనుకున్నానో అది నూటికి నూరు శాతం రాజీ లేకుండా తీశాను. ఈ సినిమా కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు’’ అని వైట్ల అన్నాడు. ఈ మధ్యే ప్రథమార్ధం రీరికార్డింగ్ తో చూసుకున్నానని.. చాలా బాగా అనిపించిందని.. మిక్కీ జే మేయర్ చాలా వేరియేషన్లున్న బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని వైట్ల తెలిపాడు. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని.. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చే్స్తామని వైట్ల ప్రకటించాడు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందించగా.. శ్రీధర్ సీపాన మాటలు రాశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/