Begin typing your search above and press return to search.
మొగుడు పెళ్ళాలంటే... అంతే మరి..
By: Tupaki Desk | 11 Nov 2015 8:37 AM GMTదీపావళి అంటే సంతోషాలు తెచ్చే పండుగ. ఇంటింటికీ పేరుపేరునా సంబరాలు తెచ్చే పండుగ ఇది. పిల్లలు - పెద్దలనే తేడా లేకుండా సంతోషాన్ని తెచ్చిస్తుందనే.. దీపావళికి అంత క్రేజ్ ఉంటుంది. సామాన్యులకే కాదు ఓ స్థాయిలో ఉన్నవారికి కూడా ఈ ఫెస్టివల్ హ్యాపీ నెస్ పంచడం ఖాయం. ఇప్పుడలాంటి సందర్భమే శ్రీనువైట్లకు కూడా ఎదురైంది.
బ్రూస్ లీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం, కోన వెంకట్ తో విబేధాలు మళ్లీ తారా స్థాయికి చేరడంతోపాటు.. శ్రీను వైట్లపై ఆయన భార్య పోలీస్ కేస్ పెట్టడం పెద్ద వివాదం సృష్టించింది. ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయనే వార్తలు వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు అంటూ కూడా కొన్ని న్యూస్ షికార్లు చేశాయి. అయితే.. ఇలాంటి వివాదాలన్నిటికీ దీపావళి పండుగతో ఫుల్ స్టాప్ పడిపోయింది.
' పిల్లలతో కలిసి దీపావళి సంతోషంగా గడిపేందుకు శ్రీను వైట్లతో కలిసి చైనా నుంచి తిరిగొచ్చాం. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దీవాళి' అంటూ పండుగ రోజున రూప వైట్ల ఓ ట్వీట్ చేశారు. భర్తతో కలిసి దిగిన ఓ సెల్ఫీని కూడా పోస్ట్ చేశారామె. ఆ పిక్ లో ఇద్దరూ ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్యా ఉన్న వివాదాలకు చెక పడ్డట్లయింది. అయినా మొగుడూ పెళ్లాలంటే అంతే మరి.. అప్పుడప్పుుడూ వాదులాడుకుంటూ ఉంటారు. మళ్లీ వాళ్లే కలిసిపోతూ ఉంటారు. ఆ విషయం తెలిసినా భార్యాభర్తల గొడవల్లో తలదూర్చి.. తర్వాత బకరాలు అవుతుంటారు చాలామంది. వీళ్ల గొడవలో బకరాల లిస్ట్ పెద్దదే ఉందిలెండి. ఎనీవే.. 2015 దీపావళి మాత్రం శ్రీనువైట్ల ఫ్యామిలీలో బోలెడు సంతోషాన్ని తెచ్చేసింది.