Begin typing your search above and press return to search.

మెగా ఫ్యాన్స్ కి వైట్ల పంచ్ తప్పదా?

By:  Tupaki Desk   |   16 Nov 2015 11:30 AM GMT
మెగా ఫ్యాన్స్ కి వైట్ల పంచ్ తప్పదా?
X
ఓ డైరెక్టర్ తన సినిమాని తనే ఫ్లాప్ - అట్టర్ ఫ్లాప్ - డిజాస్టర్ అని చెప్పే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. ఒకవేళ చెప్పాల్సొచ్చినా అనుకున్న రిజల్ట్ రాలేదని చెప్పి కవర్ చేస్తుంటారంతే. కానీ శ్రీను వైట్ల లెక్క వేరేగా ఉంటుంది. ఆయనకి కోపం వస్తే మాత్రం ఎక్కువ క్లారిటీ జోడించి మాట్లాడేస్తుంటాడు. ఆగడు విషయంలో జరిగింది ఇదే. ఆ మూవీ ఫ్లాప్ భారాన్ని వైట్ల నెత్తినే వేయడంతో.. ఆగడు ఫ్లాప్ - ఫ్లాప్ అని చాలాసార్లు అన్నాడు. ముఖ్యంగా బ్రూస్ లీ ప్రమోషన్ చేసే సమయంలో అయితే.. సమయం సందర్భం కాకపోయినా ఆగడు ప్రస్తావన తెచ్చి విసిగించాడు.

అడక్కపోయినా ఆగడు సంగతులు చెప్పుకొచ్చి.. మహేష్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు వైట్ల. మరి ఇప్పుడు బ్రూస్ లీ కూడా దెబ్బ కొట్టేసింది. నెగిటివ్ టాక్ ఫుల్లుగా వచ్చేశాక కూడా ఈ మూవీ 42 కోట్ల రూపాయలు వసూలు చేసి కలెక్షన్లు పర్లేదు అనిపించుకున్నా.. దాన్ని అమ్మిన ధర అక్షరాలా 56 కోట్లు. 14 కోట్లు లాస్ అంటే ఫ్లాప్ కిందే లెక్క. అయితే బ్రూస్ లీ ని యావరేజ్ అంటాడు కోన వెంకట్. మరిప్పుడు శ్రీను వైట్ల ఏమంటాడన్నదే ప్రశ్న. ఇప్పటివరకూ వైట్ల ఏ మూవీ స్టార్ట్ చేయలేదు, ఇంకా ఫైనల్ కూడా కాలేదు. రామ్ తో ఓ ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ స్టేజ్ లో ఉంది అని తెలుస్తోంది. చకచకా కంప్లీట్ చేయాలని భావిస్తున్న వైట్ల.. మరి ఆ ప్రమోషన్స్ అపుడు బ్రూస్ లీ రిజల్ట్ పై ఎలా స్పందిస్తాడు అని ఆసక్తి కలిగిస్తోంది.

వైట్ల మాట తీరు ప్రకారం అయితే.. ఖచ్చితంగా ఫ్లాప్ అనే అంటాడని భావించచ్చు. అంటే.. త్వరలో మెగా ఫ్యాన్స్ ని కూడా వైట్ల హర్ట్ చేసే అవకాశాలున్నాయి. ఫ్లాప్ భారం తన ఒక్కడి మీదే వేస్తున్నారని వైట్ల ఫీలవ్వచ్చు కానీ.. మరి హిట్లు కొట్టినప్పుడు ఆ క్రెడిట్ ని అకౌంట్ లో వేసుకున్నపుడు.. ఫ్లాప్స్ కూడా తీసుకోవాలి. అలాగని ఒకో మూవీకి ఒకో గ్రూప్ ని హర్ట్ చేస్తానంటే.. ఎలా ?.