Begin typing your search above and press return to search.
పుష్కర కాలం తర్వాత హిట్ కాంబో
By: Tupaki Desk | 3 April 2019 6:39 PM ISTమంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ మూవీ ఏది అంటే ఠక్కున వినిపించే సినిమా పేరు 'ఢీ'. ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా 'ఢీ' చిత్రం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంతో మంచు విష్ణుకు మంచి క్రేజ్ దక్కింది. శ్రీనువైట్ల పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో సినిమాను తెరకెక్కించాడు. శ్రీహరి - మంచు విష్ణు - బ్రహ్మానందం - సునీల్ ల కాంబో సీన్స్ సినిమా స్థాయిని పెంచాయి. ఆ సినిమా వచ్చి పుష్కర కాలం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి కాంబోలో అదే తరహా పూర్తి ఎంటర్ టైన్మెంట్ మూవీని ప్లాన్ చేస్తున్నారు.
చాలా కాలంగా 'ఢీ' సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది. సీక్వెల్ విషయం ఏమో కాని తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 12 ఏళ్ల తర్వాత శ్రీనువైట్ల గారి దర్శకత్వంలో నటించబోతున్నాను. అందుకు సంబంధించిన వర్క్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.
ఇక మంచు విష్ణు రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వైకాపా తరపున చిత్తూరు జిల్లాలో ప్రచారం చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. జగన్ గారి ఆహ్వానం మేరకు నాన్న గారు వైకాపాలో జాయిన్ అయ్యారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎం అవుతారు అంటూ మంచు విష్ణు ధీమాగా చెప్పుకొచ్చారు.