Begin typing your search above and press return to search.

విడాకుల వార్తల నేపథ్యంలో శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   25 July 2022 7:43 AM GMT
విడాకుల వార్తల నేపథ్యంలో శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్..!
X
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా రాణించిన శ్రీను వైట్ల.. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 'నీ కోసం' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీను. ఆనందం - సొంతం - వెంకీ - ఢీ - రెడీ - దుబాయ్ శీను - కింగ్ - దూకుడు - బాద్ షా వంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు.

అయితే 'ఆగడు' ప్లాప్ తర్వాత శ్రీను వైట్ల కెరీర్ మళ్లీ పుంజుకోలేదు. 'బ్రూస్ లీ' 'మిస్టర్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. చాలా గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన 'డి అండ్‌ డి' (డబుల్ డోస్) సినిమా కూడా ముందుకు సాగడం లేదు. దీనికి తోడు దర్శకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీనువైట్ల తన భార్య రూపాతో విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయని.. నాలుగేళ్లుగా విడివిడిగా వుంటున్నారని అంటున్నారు. అంతేకాదు ఇటీవల రూప తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లిందని వార్తలు వచ్చాయి.

విడాకుల వార్తలపై ఇంతవరకూ శ్రీనువైట్ల - రూప ఇద్దరూ స్పందించలేదు. అయితే తాజాగా శ్రీనువైట్ల చేసిన ఓ ట్వీట్ అతని పర్సనల్ లైఫ్ పై వస్తున్న రూమర్స్ నిజమే అనుకునే విధంగా ఉన్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

శ్రీను వైట్ల తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్న ఓ ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ''జీవితం చాలా అందమైంది. కానీ మనకు ప్రియమైన వాళ్లతో ఉంటే అది మరింత అందంగా ఉంటుంది. ఈ ముగ్గురు లేకుండా నా జీవితాన్ని ఊహించలేను'' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

అలానే మరో ట్వీట్ లో తన కుమార్తెతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. 'నా చిన్నారి జిజ్ఞాసువుతో క్యూట్ సంభాషణ' అని శ్రీను పేర్కొన్నారు. ఇలా భార్య లేకుండా తన ముగ్గురు పిల్లలతో ఉన్న ఫోటోలని షేర్ చేయడమే కాదు.. వారే తన జీవితమంటూ ఎమోషనల్ ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో నిజంగానే శ్రీను వైట్ల - రూప విడిపోయారనే రూమర్స్ నిజమేనేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు తన పిల్లలతో కలిసుంటే.. భార్య విడిగా ఉంటోందేమో అని నెటిజన్లు సందేహిస్తున్నారు.

నిజానికి గతంలోనూ వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని.. శ్రీనువైట్ల తనను వేధిస్తున్నాడని రూప కేసు కూడా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరి కుటుంబ సభ్యులు సన్నిహితులు నచ్చజెప్పడంతో కలిపోయారని అనుకున్నారు.

ఇన్నాళ్లకు మళ్లీ భార్యా భర్తలు విడిపోవాలని నిర్ణయించుకున్నారని టాక్ నడుస్తోంది. మరి శ్రీను వైట్ల విడాకుల వార్తలపై త్వరలోనే మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.