Begin typing your search above and press return to search.
'మిష్టర్' ఓకే అయితేనే మళ్ళీ 'రెడీ'
By: Tupaki Desk | 18 Aug 2016 4:41 AM GMTసినిమాలు తీయడంలోనూ స్పీడ్ చూపించే దర్శకుల్లో శ్రీను వైట్ల కూడా ఒకడు. ఎంత స్టార్ కాస్టింగ్ ఉన్నా సరే.. అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడంలో వైట్లకు మంచి గుర్తింపే ఉంది. అయితే.. ఆగడు.. బ్రూస్ లీ చిత్రాలు డిజాస్టర్లుగా మిగలడంతో ఈ మధ్య స్పీడ్ తగ్గించాడు. కెరీర్ కూడా బాగా డల్ అయిందనే చెప్పాలి. స్టార్ హీరోల రేంజ్ నుంచి కుర్ర హీరోలతో సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో మిస్టర్ మూవీని కంప్లీట్ చేస్తున్న శ్రీను వైట్ల.. తర్వాతి ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టేయడానికి ట్రై చేస్తున్నాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్ తో వైట్లకు మంచి రిలేషన్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెడీ.. ఇద్దరి కెరీర్ లోనూ ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో ఈ మూవీని సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడంటేనే ఇది ఎంత క్రేజీ ప్రాజెక్టో అర్ధం చేసుకోవచ్చు. వరుణ్ తేజ్ మిస్టర్ తర్వాత.. మరోసారి రామ్ తో జత కట్టేందుకు శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడట. నేను శైలజ మూవీతో హిట్ పట్టాలెక్కిన రామ్ తో మూవీ చేసేందుకు ఇప్పటికే స్టోరీ లైన్ కూడా రెడీ చేశాడట వైట్ల. కాంబినేషన్ ఓకే అయితే.. ఈ మూవీని నిర్మించేందుకు ఓ భారీ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇదంతా మిస్టర్ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. మిస్టర్ తో ప్రూవ్ చేసుకుంటే మాత్రం మరోసారి టాలీవుడ్ లో శ్రీను వైట్ల శకం స్టార్ట్ అయినట్లే.