Begin typing your search above and press return to search.
‘భలే’ డైరెక్టర్.. ఛాన్స్ పట్టేశాడు
By: Tupaki Desk | 29 Dec 2015 11:30 AM GMTఫీల్డ్ ఏదైనా సక్సెస్ వెంటే ఎవరైనా పరుగులు తీస్తారు. సినీ పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది. శుక్రవారం పొద్దున వరకు అనామకుడిగా ఉన్నవాడు.. మధ్యాహ్నానికి పెద్ద స్టార్ అయిపోతాడు. అతడి ఫోన్ ఆగకుండ రింగ్ అవుతూనే ఉంటుంది. శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. ఆఫర్లకు కొదవుండదు. ముఖ్యంగా తొలి సినిమాతో హిట్టు కొట్టిన డెబ్యూ డైరెక్టర్లకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.
‘భలే మంచి రోజు’తో టాలీవుడ్ లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు ఇలాంటి ఆనందంలోనే ఉన్నాడు. ఈ కుర్ర డైరెక్టర్ కోసం ఇప్పటికే కొందరు నిర్మాతలు క్యూలు కట్టేశారట. హీరోలు కూడా ఒకరిద్దరు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. అందులో మాస్ రాజా రవితేజ కూడా ఉన్నాడట. రెండో సినిమా ఏదో తేల్చుకోలేదని.. నాలుగైదు కథలు రెడీగా ఉన్నాయని సక్సెస్ మీట్లో చెప్పిన శ్రీరామ్.. అందులో ఓ కథను రవితేజకు వినిపించాడని.. అది నచ్చి దాని మీద మరింత వర్క్ చేయమని మాస్ రాజా చెప్పాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.
నిర్మాతను సెట్ చేసే బాధ్యత కూడా రవితేజే తీసుకుంటానని చెప్పి.. స్క్రిప్టు మీద దృష్టిపెట్టమని అన్నాడట. ‘భలే మంచి రోజు’ సక్సెస్ ను కొన్నిరోజులు ఎంజాయ్ చేసి.. త్వరలోనే ఈ స్క్రిప్టు మీద కూర్చుంటాడట శ్రీరామ్. ప్రస్తుతం రవితేజకు రెండు మూడు కమిట్మెంట్లున్నాయి. అవి పూర్తయ్యాక శ్రీరామ్ తో సినిమా మొదలుపెట్టొచ్చేమో.