Begin typing your search above and press return to search.
గూగుల్, ఫేస్ బుక్ వదిలేసి సినిమాలా?
By: Tupaki Desk | 29 Nov 2015 9:30 AM GMTగూగుల్.. ఫేస్ బుక్.. ఈ పేర్లు తెలియనిది ఎవరికి? పక్కా పల్లెటూరి బెల్లీకి అయినా ఫేస్ బుక్ అకౌంట్ లేనిదే నిదురే పట్టదు. గూగుల్ లో సెర్స్ చేయనిదే బతుకు తెరువే లేనిరోజులివి. అలాంటి ఆర్గనైజేషన్ లలో ఉద్యోగం వచ్చినోడు .. లక్షల్లో జీతాలు అందుకునేటోడు.. అసలు వాటన్నిటినీ త్యజించి డేరింగ్ గా సినిమాల్లోకొచ్చాడంటే ఎంతో సర్ ప్రైజ్ కదూ? కానీ అలాంటోడు వచ్చాడు. పేరు శ్రీరామ్ ఆదిత్య. భలే మంచి రోజు సినిమా తీశాడు.
ఫేస్ బుక్, గూగుల్ లో ఉద్యోగాలు చేసిన అనుభవం ఉన్నా.. ఓ పట్టాన అతడిని సినిమా పిచ్చి వదిలిపెట్టలేదు. ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకునేప్పుడే అతడు మెరిక లాంటి విద్యార్థి . అకడమిక్ తో పాటు మరోవైపు తనలోని సినిమా ఫ్యాషన్ ని బతికించుకునేందుకు ఎప్పటికప్పుడు లఘుచిత్రాలు తీస్తూ క్రియేటివిటీని చూపించేవాడు. అయితే సరిగ్గా ఇప్పుడు అదే తనకి సినీ ఇండస్ర్టీ ఎంట్రీకి ఉపయోగపడుతుందని ఊహించి ఉండడు. ఇప్పుడు సూపర్ స్టార్ ల వంశం నుంచి వచ్చిన సుధీర్ బాబు హీరోగా భలే మంచి రోజు అంటూ ఓ ఎక్స్ పెరిమెంటల్ మూవీ తీశాడు.ఈ సినిమా టీజర్ కి, ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఉద్యోగాలు పెద్దవే అయినా సినిమాపై ప్యాషన్ అంతకుమించినది. అందుకే ఇటొచ్చాను. వస్తూనే నాలాగే ఇంజినీరింగ్ చేసిన కొందరు సినీప్రియులు నాతో పాటు పనిచేస్తానంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లోకి తీసుకున్నా. మేమంతా కలిసి చేసిన ప్రయోగమిది.
రెగ్యులర్ మాస్ మసాలా మూస సినిమాలకు దూరంగా ఉండే సినిమా ఇది. ఒకరోజులో హీరోకి ఎలాంటి టిఫికట్ సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి అన్ని తెరపైనే చూడాలి.. అంటూ చెప్పుకొచ్చాడు.. శ్రీరామ్.