Begin typing your search above and press return to search.
శ్రీరస్తుకు అంత కలక్షన్ వచ్చిందంటారా?
By: Tupaki Desk | 26 Aug 2016 9:53 AM GMTఅల్లు శిరీష్- లావణ్య త్రిపాఠి జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి ఓ విచిత్రమైన పోస్టర్ పడింది. 32 లక్షల మంది చూశారంటూ నిర్మాత పోస్టర్ వేశారు. సాధారణంగా ఇంత అమౌంట్ వచ్చింది.. ఇన్ని సెంటర్లలో రికార్డులు బద్దలు కొట్టింది లాంటి పోస్టర్లు పడతాయి. కానీ శ్రీరస్తు విషయంలో 32 లక్షల మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూశారని అంటున్నారు. ఇందులో ఆలోచించాల్సిన విషయం చాలానే ఉంది.
ఇప్పుడు టికెట్ రేట్లు.. 20- 60- 90 రూపాయలు గా ఉంటున్నాయి. 20 రూపాయల టికెట్లు థియేటర్ కెపాసిటీలో పదో వంతు కూడా ఉండట్లేదు. ఆ లెక్కన యావరేజ్ టిక్కెట్ రేటు చూస్తే. 70 రూపాయలకు అటూ ఇటూగా ఉంటుంది. అంటే 32 లక్షల మంది సగటున 70 రూపాయలు చెల్లించేసుకుంటే.. దాదాపు 23 కోట్లు గ్రాస్ లెక్క తేలుతుంది. ఈ గ్రాస్ లో కనీసం రెండొంతుల షేర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే శ్రీరస్తు శుభమస్తు చిత్రానికి ఇప్పటికే 15 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని నిర్మాతలు ఇన్ డైరెక్టుగా సెలవిచ్చారన్న మాట.
చాలా అంటే చాలా టైట్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాకి 15 కోట్ల రూపాయల షేర్ అంటే.. డబుల్ బ్లాక్ బస్టర్ అనాల్సిందే. అసలు కలెక్షన్ విషయం పైకి చెప్పకుండా.. ఇలా ఆడియన్స్ లెక్కలు చెబుతుంటే ఏంటి బాబులూ ఇది? నిజమేనా ఇదంతా? అనిపించేస్తుంది. అయితే.. ఫుల్ రన్ అయ్యాక శ్రీరస్తు కలెక్షన్స్ ని గీతాఆర్ట్స్ ప్రకటిస్తుందని ఓ టాక్ ఉంది.