Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అల్లు వారి ఫిజిక్స్ పాఠం!
By: Tupaki Desk | 29 Jun 2016 1:54 PM GMTఇంకేం ఇష్టం నాలో అని అమ్మాయి అడిగితే... నీ నవ్వు బావుంటుందనో, నీ నడక బావుంటుందనో చెబుతాడు ఏ అబ్బాయైనా! కానీ ఇక్కడ మాత్రం వ్యవహారం రివర్స్. ఏకంగా నీ ఫిజిక్ బావుందని చెప్పేశాడు అబ్బాయి. ఆ మాట విన్నాక ఏ అమ్మాయికైనా ఒళ్లు మండిపోతుంది కదా! ఇక్కడ కూడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే శ్రీరస్తు శుభమస్తు సినిమా చూడాల్సిందే. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు.
త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి కిందటే బయటికి వచ్చింది. ఇదొక ప్రేమకథే అయినా... ఫిజిక్స్ పాఠాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. `లైఫ్ లో ఎవ్వరినీ ఎక్కువగా ప్రేమించకూడదు. ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్... మన క్యారెక్టర్ ని తెలీకుండా మనమే చంపేసుకొంటుంటాం` అంటూ హీరో డైలాగ్ చెబుతాడు. అందులో పరశురామ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. మనల్ని మనమే ఎక్కువగా ప్రేమించుకోవాలని, వేరేవాళ్ల మోజులో పడి మన క్యారెక్టర్ ని మనం చంపేసుకోకూడదని అందులో అర్థం కనిపిస్తోంది. టీజర్ లో చెప్పుకోదగ్గ పంచ్ - కామెడీ డైలాగ్ గట్రా లేకపోయినా ఓ విషయాన్ని మాత్రం సీరియస్ గా డిస్కస్ చేస్తూ సాగే చిత్రమని అర్థమవుతోంది.