Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డి ఇంటి ఓనర్ పిలిచి మాట్లాడారట
By: Tupaki Desk | 8 April 2018 7:40 AM GMTఇంతకాలం సోషల్ మీడియాలోనూ.. వెబ్ ఇంటర్వ్యూలు.. టీవీ ఛానల్ చర్చల్లో పాల్గొంటూ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్న సినీ నటి శ్రీరెడ్డి తాజాగా ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ మీద ఓపెన్ గా మాట్లాడిన ఆమె.. నిన్నటికి నిన్న ఫిలింఛాంబర్ ఎదుట అర్థనగ్నంగా నిరసన నిర్వహించారు.
ఈ వ్యవహారం పెను సంచలనానికి తెర తీసింది. బట్టలు విప్పదీసి అర్థనగ్నంగా మారి.. ఫిలింఛాంబర్ ఎదుట నిరసన చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఇదిలా ఉండగా.. తాజాగా తన ఇంటి ఓనర్ తనను పిలిపించారని.. ఇంటిని ఖాళీ చేయాలని చెప్పారంటూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
"ఎంత గొప్ప వ్యక్తో చూడండి. ఆయనో ఐఏఎస్ ఆఫీసర్. మనసు అనేది లేని మనుషులు.. ఎంత మొరటుగా మాట్లాడతారో కనీసం మీరు ఊహించను కూడా ఊహించలేరు.. బడాబాబుల ఆట మొదలైంది" అంటూ శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు మరో సంచలనంగా మారింది.