Begin typing your search above and press return to search.

‘డిక్టేటర్’ డైరెక్టర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

By:  Tupaki Desk   |   16 Feb 2017 10:23 AM GMT
‘డిక్టేటర్’ డైరెక్టర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!
X
గోపీచంద్‌ తో చేసిన ‘లక్ష్యం’.. ‘లౌక్యం’ మినహాయిస్తే శ్రీవాస్ కెరీర్లో మెరుపులేం లేవు. ‘లక్ష్యం’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన శ్రీవాస్.. ఆ తర్వాత డౌన్ అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ‘లౌక్యం’ అతడికి లైఫ్ ఇచ్చింది. కానీ ఈ సినిమా తెచ్చిన పేరును శ్రీవాస్ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో అతను చేసిన ‘డిక్టేటర్’ ఫ్లాప్ అయింది. దీంతో ఏడాదికి పైగా గ్యాప్ వచ్చేసింది. మధ్యలో గోపీచంద్ హీరోగా ఒక సినిమా అని.. ఇంకోటని ఏవో వార్తలొచ్చాయి కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. ఐతే ఎట్టకేలకు శ్రీవాస్ ఒక సినిమా కమిటైనట్లు సమాచారం.

‘అల్లుడు శీను’తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ తో శ్రీవాస్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు. ‘స్పీడున్నోడు’ దెబ్బ కొట్టాక బోయపాటి శీను లాంటి స్టార్ డైరెక్టర్ తో జట్టు కట్టాడు బెల్లంకొండ కొడుకు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇంకో మూడు నెల్లో సినిమా పూర్తవుతుంది. ఆ తర్వాత శ్రీవాస్ సినిమా చేయడానికి రంగం సిద్ధ చేసుకుంటున్నాడు శీను. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ బ్యాకప్ తో శ్రీవాసే నిర్మించే అవకాశాలున్నాయి. ఫైనాన్షియయర్లు.. బయ్యర్లతో సమస్య వల్ల కొడుకు సినిమాల్ని నేరుగా నిర్మించట్లేదు బెల్లంకొండ. ఫినాన్షియల్ బ్యాకప్ ఇస్తూ వేరే వాళ్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నాడు. శ్రీనివాస్-శ్రీవాస్ సినిమా కూడా అలాగే చేస్తారట. ప్రస్తుతం స్క్రిప్టు రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు శ్రీవాస్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/