Begin typing your search above and press return to search.

దానయ్య తనయుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా...?

By:  Tupaki Desk   |   17 May 2020 10:30 AM GMT
దానయ్య తనయుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా...?
X
చిత్ర పరిశ్రమలో నట వారసులకు కొదవ ఉండదు. టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టేయవచ్చు. ఒక్కరు ఇండస్ట్రీలో అడుగుపెడితే వారి నుండి యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో తమ నట వారసులను పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కి చాలా మంది వారసులు హీరోలుగా పరిచయమయ్యారు. వీరే కాకుండా కొంతమంది హీరోలు దర్శకులు నిర్మాతలు కూడా తమ పిల్లలని సినిమాల్లోకి తీసుకొచ్చారు. వారిలో చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఒకరిద్దరు మాత్రం ఒక్క సినిమాకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత దానయ్య కుమారుడి ఎంట్రీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపిన డీవీవీ దానయ్య చివరికి డైరెక్టర్ శ్రీవాస్ ని ఫైనలైజ్ చేసాడు. అందరూ హిట్ డైరెక్టర్ తో తమ వారసులని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తుంటే దానయ్య మాత్రం తన కొడుకుని ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెడుతున్నాడు. 'లక్ష్యం' 'లౌక్యం' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు తీయలేదనే చెప్పాలి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీవాస్ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' లాంటి భారీ బడ్జెట్ సినిమా నిర్మిస్తున్న దానయ్య ఈ సినిమాని ఆర్.ఆర్.ఆర్ పూర్తయిన తర్వాత స్టార్ట్ చేయనున్నాడట.

నిజానికి టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ ఉంది. ఎంతో మందిని స్టార్ హీరోలుగా మార్చిన దర్శకనిర్మాతలు తమ వారసులని మాత్రం హీరోలుగా నిలబెట్టలేరనే సెంటిమెంట్ టాలీవుడ్ బలంగా నమ్ముతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు తన కొడుకు అరుణ్ కుమార్ ని హీరోగా నిలబెట్టలేకపోయాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ ఒక్క సినిమాకే పరిమితమయ్యాడు. కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ కోలీవుడ్ లో వైభవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అల్లు అరవింద్ కుమారుల్లో బన్నీ హీరోగా సక్సెస్ అవ్వగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన బ్రేక్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో తమ వారసులని హీరోలుగా నిలబెట్టాలని ఫెయిల్ అయిన వారు చాలామందే ఉన్నారు. మరి దానయ్య తన కొడుకుని హీరోని చెయ్యాలనే డ్రీం అయితే నెరవేర్చుకుంటున్నాడు. కానీ దానయ్య తనయుడు ఈ సెంటిమెంట్ ని దాటుకొని నిలబడగాలడా లేదా అనేది చూడాలి. వాస్తవానికి బ్యాగ్రౌండ్ అనేది మొదటి సినిమాకి మాత్రమే పనిచేస్తుంది. తర్వాత రోజుల్లో తమ టాలెంట్ చూపించుకోకపోతే వారు సినిమాలకు దూరం అవ్వాల్సిందే. ఈ విషయం ఎంతో మంది నట వారసుల విషయంలో నిజమైంది. మరి దానయ్య తనయుడు భవిష్యత్ ఎలా ఉండబోతోందో చూడాలి.