Begin typing your search above and press return to search.
ఛాన్సొస్తే ఎవరిని ఉతికేస్తుందో...
By: Tupaki Desk | 14 July 2015 5:04 PM GMTఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ డేస్‌ని ఎవరూ మర్చిపోలేరు. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అందమైన అనుభూతులెన్నో జ్ఞప్తికి వస్తూ మధురానుభూతుల్ని మిగులుస్తాయి. అయితే అలాంటి అనుభూతుల గురించే ముచ్చటిస్తూ ఓ సందర్భంలో శ్రీయ ఇలా చెప్పుకొచ్చింది. నేను స్కూలుకెళ్లేప్పుడు చబ్బీ గాళ్‌లాగా ఉండేదాన్ని. నన్ను చూసి బొద్దమ్మాయ్ అంటూ తోటి విద్యార్థులంతా ఆటపట్టించేవారు. తిరిగి ఏదో ఒక ఆటలో కసి తీర్చుకునేలా తన్నేదాన్ని. దొరికిన వాళ్లను దొరికినట్టే ఉతికేసేదాన్ని.. అంటూ చెప్పుకొచ్చింది.
మా టీచర్లు అయితే.. ఆహా యూనిఫామ్‌ని ఎంత నీట్‌గా వాడుతోందో? ఎంత ట్యాలెంటెడ్ గాళో అంటూ పొగిడేసేవారు. అంతేనా ఎగ్జామ్స్‌లో అందరికంటే టాప్ ర్యాంకర్ నేనే. ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? దానిపై గుడ్ అంటూ మంచి రిమార్క్ రాసిచ్చేవారు. టీచర్లు, అమ్మా నాన్న నా విషయంలో ఎంతో హ్యాపీ. స్టడీస్‌లో, రేసులో అన్నిటిలో నేనే ఫస్ట్. నా అంత బుద్ధిమంతురాలైన బిడ్డ వేరే తల్లిదండ్రులకు దొరకదు.. అంటూ చెప్పుకొచ్చింది. సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని, కొబ్బరి నూనె రాసుకుని, జిడ్డు మొహంతో స్కూలుకెళ్లేదాన్నని కూడా చెప్పింది. ఏదో ఒకటిలే.. చిన్నప్పుడు కాబట్టి స్కూల్లో తోటి విద్యార్థుల్ని ఏదో వంకతో తెగ కొట్టేసింది. అదే ఇప్పుడున్న హీరోల్లో తనకి నచ్చని వారిని పిడిగుద్దులు గుద్దేసే అవకాశం వస్తే ఎవరిని ఉతికేస్తుందంటారూ? ఏమో 'రానా' పేరే గుర్తొస్తోంది!