Begin typing your search above and press return to search.
శ్రీయ ఆశలు మళ్లీ గోవిందా...
By: Tupaki Desk | 1 Aug 2015 8:00 AM GMTమలయాళ హిట్ చిత్రం దృశ్యం ఇప్పటికే తెలుగు, తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. తెలుగులో వెంకీ, తమిళ్ లో వెంకటేష్ ఇద్దరికీ మంచి పేరొచ్చింది. అయితే హిందీ వెర్షన్ కి మాత్రం పెదవి విరుపులు కనిపిస్తున్నాయని సమాచారం. హిందీ రీమేక్ లో అజయ్ దేవగన్, శ్రీయశరణ్, టబు తదితరులు ప్రధానపాత్రలు పోషించారు.
సినిమా గ్రిప్పింగ్ గా ఉంది. కానీ కుర్చీ అంచుమీద కూచుని చూసేంత ఏమీ లేదే.. అంటూ జనాలు దీర్ఘాలు తీస్తున్నారక్కడ. అంటే హిందీ దృశ్యం యావరేజ్ కిందే లెక్క. మలయాళం, తమిళం, తెలుగులో హిట్టయినంతగా అక్కడ కాలేదనే అర్థం. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కేవలం యావరేజ్ గా నిలిచిందని సమీక్షలు కూడా చెబుతున్నాయి.
ఫలితం ఏదైనా ఇది శ్రీయకి తీవ్ర నిరాశని మిగిల్చేదే. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో పద్ద స్టార్ అయిపోవాలన్న ప్రయత్నాల్లో ఉంది శ్రీయ. కానీ ఇంతవరకూ అక్కడ ఒక్క హిట్టు కూడా దక్కలేదు. ఈసారి దృశ్యం సినిమా తన ఫేట్ మారుస్తుందని భావించింది. అయితే విమర్శకుల నుంచి వస్తున్న పెదవి విరుపును బట్టి శ్రీయకు మరోసారి పరాభవం ఎదురైనట్టే. కొంతలో కొంత గుడ్డిలో మెల్లలాగా శ్రీయ నటనకు మాత్రం విమర్శకులు మంచి మార్కులే వేశారు.