Begin typing your search above and press return to search.
శ్రీయ గురించి తెలియని నిజాలెన్నో
By: Tupaki Desk | 9 Sep 2015 4:27 AM GMTఇష్టం సినిమాతో కథానాయికగా ప్రారంభవమైన శ్రీయ శరణ్ ఇప్పటికి 14 సంవత్సరాల కెరీర్ ని సాగించింది. ఇన్నేళ్లలో ఎన్నో సంగతులు. అసలు శ్రీయ ఈ రంగంలోకి ఎలా వచ్చింది? అసలు తన నేపథ్యం ఏంటి? అన్నది తెలుసుకుంటే ఎంతో ఆసక్తికరం.
శ్రీయ తండ్రి పుష్పిందర్ శరణ్ బిహెచ్ ఇఎల్ లో సివిల్ ఇంజినీర్, మమ్మీ కెమిస్ట్రీ టీచర్. ముంబై లో ఉండేవారు. సోవన నారాయణ్ తన గురువు. అక్కడే కథక్ నేర్చుకుంది. 14వయసులోనే కథక్ నేర్చుకోవడానికి సోవన నారాయణ్ వద్దకు వెళ్లి తనని ఇంప్రెస్ చేసి విద్యార్థినిగా చేరింది. ఆ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అకమడమిక్ స్టడీస్ కి చేరింది. అసలు సినీకెరీర్ లో ఎలా ప్రవేశింది అంటే.. వారణాసిలో ఎవరో మ్యూజిక్ వీడియో తీస్తుంటే వెళ్లమని గురువుగారు సజెస్ట్ చేశారు. అలా ఆ వీడియోలో నటించి యూట్యూబ్ లో పాపులర్ అయ్యింది. అది తెలుగులో ఓ దర్శకుడు చూసి ఇష్టం సినిమాకి ఎంపిక చేసుకున్నాడు. ఇన్నేళ్ల సుదీర్ఘ ఇన్నింగ్స్ ని కొనసాగించిన శ్రీయ ఇప్పటికి వన్నె తరగని శిరులతో యువతరాన్ని ఆకట్టుకుంటూనే ఉంది.
ఓ ప్రఖ్యాత మ్యాగజైన్ కు స్పెషల్ ఇంటర్యూ ఇచ్చిన శ్రీయ ఈ విషయాలను తెలియజేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల్ని శ్రీయ పాఠకులతో పంచుకుంది. అదీ సంగతి.