Begin typing your search above and press return to search.
సక్సెస్‌లు లేవు.. టాలెంట్ చూసే -శ్రీయ
By: Tupaki Desk | 12 July 2015 12:12 AM GMTఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ కథానాయికగా అవకాశాలు అందుకుంది శ్రీయ శరణ్. దశాబ్ధం పైగానే కెరీర్‌ని సాగించి ఇప్పటికీ ఫామ్ కొనసాగిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2001లో ఇష్టం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు అప్పుడు ఎంత స్లిమ్ముగా కనిపించిందో ఇప్పటికీ అదే రూపురేఖలతో ఆకట్టుకుంటోంది. ఆ కమిట్‌మెంట్ ఉంది కాబట్టే సక్సెస్ లేకపోయినా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
ఇదే విషయంపై శ్రీయ ముచ్చటిస్తూ.. ''అవును.. నాకు ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అవకాశాలొచ్చాయి. బాలీవుడ్‌లో అస్సలు సక్సెస్ అనేదే లేదు. అలాగని టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ కాదు. రెండుచోట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా నాకు చక్కని అవకాశాలొస్తున్నాయంటే నా ప్రతిభ చూసే. హిందీ నా మాతృభాష. అందుకే ఇక్కడ ఏదైనా అవకాశం వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరమే లేకుండా అంగీకరిస్తున్నా'' అని చెప్పింది.
ప్రస్తుతం అజయ్‌దేవగన్ సరసన 'దృశ్యం'(రీమేక్)లో నటిస్తున్నా. ఈ చిత్రంలో టబు వంటి సీనియర్ నటితో కలిసి నటించాను. టబు చాలా స్వీట్. ఆన్‌సెట్స్ అందరికీ బిర్యానీ తెచ్చి పెడుతుంది. ఇక అజయ్‌దేవగన్ నేనొక స్టార్‌ని అన్న బ్యాగేజీ చూపించడు. ఇలాంటి టీమ్‌తో పనిచేయడం సంతోషంగా ఉంది.. అని అంటోంది అమ్మడు. ఈ సినిమాతో మరి బాలీవుడ్‌లో తన ప్లేస్‌ను పదిలం చేసుకుంటుందేమో చూద్దాం.