Begin typing your search above and press return to search.
ఆ రెమ్యూనరేషనే ఆమెకు పెద్ద ఎసెట్
By: Tupaki Desk | 31 Jan 2018 11:30 PM GMTవయసు పెరిగినా సొగసు తరగని.. క్రేజ్ తగ్గని బ్యూటీ శ్రియ సరన్. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత ఫిట్ గా బ్యూటీగా కనిపించిందో ఈనాటికీ అదే ఫిట్ నెస్ తో కనిపించడం ఈ భామ స్పెషాలిటీ. అందమైన చిరునవ్వు.. అద్భుతమైన డ్యాన్స్ ఆమెకున్న స్పెషల్ అసెట్స్. అందుకే ఇప్పటికీ ఆమె డెయిరీలో కాల్షీట్లు బిజీగానే కనిపిస్తుంటాయి.
శ్రియ ఇప్పటికీ దర్శక - నిర్మాతల ఫేవరెట్ గా కొనసాగడం వెనుక మరో సీక్రెట్ కూడా ఉంది. అది ఆమె రెమ్యునరేషన్. శ్రియ రెమ్యునరేషన్ విషయంలో చాలా లిబరల్ గా ఉంటుందట. సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి ఆమె తీసుకునే మొత్తం మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే చాలా తక్కువ మొత్తంగానే ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దం దాటిపోవడంతో పర్టిక్యులర్ గా హీరోయిన్ పాత్రలే చేస్తానని పట్టు పట్టుకుని కూర్చోకుండా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు సరే అంటోంది. ఇలాంటి పాత్రలకు వారమో.. రెండువారాలో టైం కేటాయిస్తే సరిపోతుంది. దానికి తగ్గట్టు ఇలాంటి రోల్స్ కు ఆమె ఛార్జ్ చేసే మొత్తం మామూలుగా కన్నా తక్కువే తీసుకుంటోంది.
శ్రియ సరన్ ఫ్రెండ్లీ నేచర్ ఇండస్ట్రీలో సుపరిచితం కావడంతో ఆమెతో తిరిగి పనిచేయడానికి దర్శక - నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ - కోలీవుడ్ లోనూ శ్రియకు మంచి ఇమేజే ఉంది. అందుకే ఇప్పటికీ అర డజనుకుపైగా సినిమాలు ఆమె చేతుల్లో ఉన్నాయి. ట్రెండ్ కు తగ్గట్టు ఎలా ఫాలో అవాలో శ్రియకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి.