Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: డోస్ పెంచిన శ్రియ

By:  Tupaki Desk   |   7 Jan 2016 10:23 AM GMT
ఫోటో స్టోరి: డోస్ పెంచిన శ్రియ
X
టాలీవుడ్ లో టాప్ స్టేజ్ కి చేరిన హీరోయిన్లలో శ్రియకి స్పెషల్ ప్లేస్ ఇవ్వాల్సిందే. 15ఏళ్ల నుంచి కెరీర్ కంటిన్యూ చేస్తున్నా.. ఇంకా హీరోయిన్ గా చేయగలగడమే.. శ్రియ అసలు ప్రత్యేకత. అయితే.. ఈ సీనియర్ భామకు ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. పేరున్న సినిమాల్లో నటించినా ఆమెకు పేరు మాత్రం రావడం లేదు.

తెలుగులో పవన్ కళ్యాణ్ - వెంకటేష్ ల మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకున్నా, కమర్షియల్ గా క్లిక్ కాలేదు. మరోవైపు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో కలిసి దృశ్యం చిత్రంలో చేసింది. ఇది హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టినా, శ్రియకు మాత్రం ఉపయోగపడలేదు. నిజానికి దృశ్యం తర్వాత బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తాయని ఈ సీనియర్ భామ భావించింది. అలాంటి ఆశలేవీ నెరవేరకోవడంతో నిరుత్సాహపడాల్సి వచ్చింది. అలాగని తన ప్రయత్నాలను వదిలేసే టైప్ కాదు ఈ హీరోయిన్. అందుకే స్పెషల్ ఫోటో షూట్ తో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ టాప్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది.

తానింకా ఎంత హాట్ గా ఉందో, మరెంత హాట్ గా చేయగలదో ఇన్ డైరెక్ట్ గా చెప్పడానికే ఈ ఫోటో షూట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఆ ట్రాన్స్ పరెంట్ టాప్ లోంచి.. శ్రియ లోపల వేసుకున్న అండర్ గార్మెంట్స్ తో పాటు.. ఆమె అందాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ ఏజ్ లో ఇంతగా రెచ్చిపోవడానికి, అందాల డోస్ పెంచడానికి కారణం.. కొత్త ఆఫర్ల వేట అని స్పెషల్ గా చెప్పాలంటారా?