Begin typing your search above and press return to search.

షారుఖ్ కూతురు చేసిన పనికి అంతా షాక్

By:  Tupaki Desk   |   5 July 2018 9:02 AM GMT
షారుఖ్ కూతురు చేసిన పనికి అంతా షాక్
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానాఖాన్ ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో ఉంటోంది. తాజాగా సుహానా ఖాన్ ఓ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే.. సుహానాపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం షారుఖ్ తన ఫ్యామిలీతో కలిసి యూరప్ లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిచ్ లో సందడి చేశారు. అక్కడ సుహానా టు పీస్ బికినీ ధరించింది. అంతేకాదు.. ఆ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. హాట్ టా ఉండడం. పైగా ఫొటోలో షారుఖ్ చిన్న కొడుకు అభిరామ్ ఉండడంతో ఆమెపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

సుహానా ముస్లిం కావడంతో ఆ వర్గం వారు అంతా ఆమెను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ‘నువ్వు ఒక ముస్లింవి అన్న విషయం మరిచిపోవద్దు.. సిగ్గు లేదా.? నీ ప్రైవసీ నీది కావచ్చు. కానీ ఇలాంటి ఫొటోలు దేశమంతా చూస్తారన్న విషయం మరిచిపోకు.. నువ్వు సంప్రదాయాలకు కూడా పాటిస్తే మంచిది.. మీ తండ్రి అంటే ఎంతో గౌరవం.. కానీ ఇలా పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటివి ఎక్స్ పర్ట్ చేయడం లేదు’ అంటూ నెటిజన్లు సుహానపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని సుహానా మాత్రం లైట్ తీసుకుంది. ఇంకా మతం కట్టుబాట్లు అంటూ అమ్మాయిలను ఎవరూ బంధించలేరని ఆమె స్పష్టం చేసింది. గతంలో మెహరీన్ ఖాన్ - సానియా మీర్జా - హీనాఖాన్ తదితరులు కూడా ఇలా బికినీ వేసుకుంటే నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సుహానా కూడా అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. షారుఖ్ ఖాన్ మాత్రం ఈ వివాదంపై ఇంతవరకూ స్పందించలేదు.