Begin typing your search above and press return to search.
అంతా మీరే చేశారు! అంటూ ఖాన్ వారసుడి ఆవేదన!!
By: Tupaki Desk | 12 Jun 2022 4:31 AM GMTనువ్వు పెద్ద తప్పు చేశావ్.. నా ప్రతిష్ఠను మంట గలిపావ్! అంటూ భగభగలాడాడు ఖాన్ వారసుడు. డ్రగ్స్ బస్ట్ కేసులో అరెస్టయిన అనంతరం చాలా కాలానికి షారూక్ వారసుడు ఆర్యన్ ఖాన్ మౌనం వీడాడు. అంతేకాదు ఒక రకంగా అతడు విరుచుకుపడ్డాడు. ఆవేదన చెందాడు. తన కలతను స్పష్టం చేసాడు.
షారూఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట గారాల సుపుత్రుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకుని గత ఏడాది హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. 2021అక్టోబర్ లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించి కొందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 2 అక్టోబరు 2021 రాత్రి ఆర్యన్ తో పాటు మరికొంతమందిని నార్కోటిక్స్ బృందం అదుపులోకి తీసుకుంది. బెయిల్ పై విడుదల చేయడానికి ముందు అర్యన్ ని 28 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. 2022 మేలో తగిన సాక్ష్యాధారాలు లేనందున క్రూయిజ్ డ్రగ్ బస్ట్ కేసులో ఎన్సీబీ ఆర్యన్ కి క్లీన్ చిట్ ఇచ్చింది.
కానీ చాలా కాలానికి 23 ఏళ్ల ఆర్యన్ ఇప్పుడు దీనిపై బహిరంగంగా మాట్లాడాడు. మాట్లాడాడు అనే కంటే ఉక్రోషంతో విరుచుకుపడ్డాడు! అనడమే కరెక్ట్. అతనిలో ఎటువంటి తప్పు కనుగొనలేదు. కానీ తన ప్రతిష్టను దిగజార్చారని ఆందోళన చెందాడు.
మీరు చాలా పెద్ద తప్పు చేశారు! అంటూ తీవ్ర స్వరంతో ఆర్యన్ విరుచుకుపడ్డాడు. నా ప్రతిష్ఠను మంట కలిపారని ఆవేదన చెందాడు.
అరెస్ట్ తనపై ఎలాంటి ప్రభావం చూపిందనే దానిపై మౌనం వీడాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)కి నేతృత్వం వహిస్తున్న NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రాజ్ చెంగప్ప- సంజయ్ సింగ్ రాసిన `లెసన్స్ ఫ్రమ్ ది ఆర్యన్ ఖాన్ కేస్` అనే కవర్ స్టోరీని ఇండియా టుడే మ్యాగజైన్ ఆవిష్కరించింది. ఆర్యన్ ఖాన్ తో సంజయ్ సింగ్ చేసిన సంభాషణలో ఆర్యన్ సిట్ అధికారిని ఇలా అడిగాడు.
``సార్ .. మీరు నన్ను అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికర్ గా చిత్రించారు. నేను మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు నిధులు సమకూరుస్తాను అని అన్నారు. ఈ ఆరోపణలు అసంబద్ధం కాదా? నాతో ఎలాంటి డ్రగ్స్ ను కనుగొనలేదు. అయినప్పటికీ నన్ను అరెస్టు చేశారు. సార్.. మీరు నా విషయంలో చాలా తప్పు చేసారు. నా ప్రతిష్టను నాశనం చేసారు. నేను ఇన్ని వారాలు జైలులో ఎందుకు గడపవలసి వచ్చింది? నేను నిజంగా దానికి అర్హుడినా?`` అని ప్రశ్నించాడు. ఒక రకంగా అతడి స్వరంలో ఆవేదన కనిపించింది.
ఇంతకుముందు ఆర్యన్ ఆరెస్ట్ సమయంలో తన కొడుకు మానసిక క్షేమం గురించి షారూఖ్ ఖాన్ కూడా ఆందోళన చెందుతున్నాడని.. అతని కొడుకు సరిగ్గా నిద్రపోవడం లేదని సంజయ్ సింగ్ వెల్లడించాడు. ఆర్యన్ ఖాన్ తో సహవాసం చేయడానికి రాత్రిపూట అతని బెడ్ రూమ్ కి వెళ్తానని ఖాన్ అన్నట్టు సంజయ్ సింగ్ ఇంతకుముందు చెప్పాడు. ``సమాజాన్ని నాశనం చేయడానికి బయలుదేరిన పెద్ద నేరస్థులు లేదా రాక్షసులుగా మమ్మల్ని చిత్రీకరించారు. మేము ప్రతిరోజూ కఠినమైన దినాలను అనుభవిస్తున్నాము`` అని SRK దాదాపు కన్నీళ్లతో కనిపించాడని సింగ్ వెల్లడించాడు.
ఈ ఏడాది మార్చిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆర్యన్ ఖాన్ పెద్ద కుట్రలో భాగం కాదని నివేదించింది. ఆర్యన్ ఖాన్ భారీ డ్రగ్స్ కుట్రలో లేదా అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికింగ్ సిండికేట్ లో భాగమని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సిట్ పేర్కొన్నట్లు కథనాలొచ్చాయి.
జాతీయ మీడియా ప్రకారం.. ఆర్యన్ ఖాన్ ఎప్పుడూ డ్రగ్స్ ను తనతో ఉంచుకోలేదు. చాటింగులు చేయలేదు. అందువల్ల అతని ఫోన్ తీసుకొని అతని చాట్ లను తనిఖీ చేయవలసిన అవసరం లేదు. రెగ్యులర్ చాట్ లు ఖాన్ ఏ అంతర్జాతీయ సిండికేట్ లో భాగమని సూచించలేదు. అందుకే NCB మాన్యువల్ ద్వారా తప్పనిసరి అయినట్లుగా వీడియోను రికార్డ్ చేయలేదు. ఈ కేసులో అరెస్టయిన బడా డ్రగ్ డీలర్స్ నుండి రికవరీ చేసిన డ్రగ్స్ సింగిల్ రికవరీగా మాత్రమే చూపించారు. ఎక్కడా ఆర్యన్ ఖాన్ పేరు లేదు.. అని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.