Begin typing your search above and press return to search.
మెంటల్ హై క్యా.. కింగ్ ఖాన్ రోల్ ఏంటి?
By: Tupaki Desk | 3 May 2019 1:40 AM GMTదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ప్రస్తుతం బాలీవుడ్ లో లక్ చెక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ఓ ప్రయోగాత్మక స్క్రిప్టుతో ట్యాలెంటెడ్ స్టార్లతో సినిమా తీస్తున్నారు. `మెంటల్ హై క్యా` అనేది టైటిల్. ఈ చిత్రంలో క్వీన్ కంగన రనౌత్ - రాజ్ కుమార్ రావ్ వంటి స్టార్లు నటించడం ఆసక్తికరం. ఈ సినిమాకి ప్రకాష్ కోవెలమూడి వైఫ్ కనిక దిల్లాన్ స్క్రిప్టును అందించారు. ప్రఖ్యాత బాలాజీ టెలీఫిలింస్ పతాకంపై ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ చిత్రంలో కింగ్ ఖాన్ షారూక్ ఓ అతిధి పాత్రను పోషిస్తున్నారు. తన రోల్ కి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. షారూక్ ఎలాంటి రోల్ లో నటిస్తున్నారు అంటే .. కేవలం కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసే అతిధి పాత్ర ఇదని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే తనపై చిత్రీకరణను పూర్తి చేశారు. 2018లో మొదలైన ఈ సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాది జూన్ 21న సినిమా రిలీజ్ కానుంది.
ఇక `సైజ్ జీరో` తర్వాత ప్రకాష్ కోవెల మూడి చాలా గ్యాప్ తీసుకుని బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. తనకు కనిక దిల్లాన్ కథల్ని అందించడం విశేషం. ఈ జోడీ సైజ్ జీరో స్క్రిప్టును రూపొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పని చేస్తున్న `మెంటల్ హై క్యా` పై ఆ ఇద్దరూ చాలానే అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రకాష్ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. అనగనగా ఓ ధీరుడు.. సైజ్ జీరో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లవ్వడంతో కెరీర్ ఆశించిన విధంగా టేకాఫ్ కాలేదు. కనీసం బాలీవుడ్ లో అయినా ఓ హిట్టొస్తే.. అక్కడ కెరీర్ పరంగా స్పాన్ పెంచుకునే వీలుంటుందని భావిస్తున్నారట. కనిక దిల్లాన్ చక్కని సెన్సిబిలిటీస్ ఉన్న రచయిత అని సన్నిహితులు చెబుతుంటారు. అది ఈసారైనా హబ్బీ కి కలిసొస్తుందేమో చూడాలి.