Begin typing your search above and press return to search.
బాద్ షా 30 ఏళ్ల ప్రస్థానం.. 'పఠాన్' లుక్ వైరల్!
By: Tupaki Desk | 25 Jun 2022 10:30 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి హిందీ పరిశ్రమలో కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా ఎదిగారు. ఖాన్ త్రయంలోనే బాద్ షాకి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. యావత్ దేశం మెచ్చిన స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నారు. తాజాగా షారుక్ సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది.
మూడు దశాబ్ధల ప్రయాణంలో ఎన్నో ఎత్లు పల్లాలు చూసారు. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అటుపై ఒక్కో సినిమాతో తన స్టార్‌డమ్ పెంచుకుంటూ వచ్చారు. ఇక షారుక్- కాజల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'..'దిల్ సే' సృష్టించిన సంచలనాలు గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
దిల్ వాలే ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. 'దీవానా' నుంచి 'జీరో' వరకూ దాదాపు 80 సినిమాలు చేసారు. ఇక నిర్మాతగాను షారుక్ ప్రయాణం ఎంతో సాపీగా సాగింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ పై బాక్సీపీస్ వద్ద ఎన్నో మ్యాజిక్ హిట్లు అందుకున్నారు.
1.షారుఖ్ ఖాన్ 1990 నుంచి అత్యధిక సంఖ్యలో బాక్సాఫీస్ ఓపెనింగ్స్ సాధించిన హీరోగా ఖ్యాతికెక్కారు. 80 చిత్రాల్లో 62 చిత్రాలు మంచి ఓపెనింగ్స్ సాధించాయి. బాక్సాఫీస్ కా బాప్ అని ఎన్నోసార్లు నిరూపించారు. ఈ విషయంలో షారుక్ మిగతా హీరో లకంటే ముందజలో ఉన్నారు.
2. షారుఖ్ ఖాన్ 1990ల నుండి వరుసగా అత్యధిక విజయవంతమైన చిత్రాలను కలిగి ఉన్నారు. వరుసగా 12 చిత్రాలు విజయవంతమైనా అంతకంటే ఎక్కువ విజయాన్ని సాధించినవి మరికొన్ని ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని కల్గింది షారుక్ కావడం విశేషం.
3. 2000 నుండి 2004 వరకు అతని చిత్రాలు ఎల్లప్పుడూ అత్యధిక వసూళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా 5 బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ వైడ్ హయస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇయర్ అందించిన ఏకైక నటుడిగా షారుఖ్ ఖ్యాతికెక్కారు.
4. షారుఖ్ ఖాన్ ఓవర్సీస్‌లో అత్యధికంగా బ్యాక్ టు బ్యాక్ 10 మిలియన్ డాలర్ గ్రాసర్స్ అందించారు.' మై నేమ్ ఈజ్ ఖాన్' నుండి 'జీరో' వరకు అతని చిత్రాలన్నీ ఓవర్సీస్ నుండి 10 మిలియన్ డాలర్లు దాటాయి.
5. షారుఖ్ ఖాన్ ఒకే సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. 1995 సంవత్సరంలో 10 కోట్లకు పైగా టిక్కెట్లను విక్రయించిన చిత్రాల్లో షారుక్ సినిమాకి రికార్డు ఉంది. ఇది ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం. టిక్కెట్ రేట్లను ప్రస్తుత ధరలకు సర్దుబాటు చేసి.. టిక్కెట్‌ల పన్నును పరిగణనలోకి తీసుకుంటే స్థూల మొత్తం రూ.3000 కోట్ల వరకూ ఉంటుంది. ఇంకా షారుక్ ఖాతాలో ఇలాంటి రికార్డులు ఎన్నో ఉన్నాయి.
30 ఏళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంగా షారుక్ కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'పఠాన్' యూనిట్ అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'పఠాన్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు. లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
గ్యాంగ్ స్టర్ పఠాన్ గా షారుక్ రగ్గడ్ లుక్ అభిమానుల అంచనాల్ని అంతకంతకు పెంచేస్తుంది. పఠాన్ చేతిలో గన్.. చేతికి బేడీలతో ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లో బీజీఎమ్ పఠాన్ ని అమాంతం పైకి లేపుతుంది. ప్రస్తుతం ఈ ఫోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా సినిమాలో దీపికా పదుకొణె.. జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసి జనవరి 25- 2023లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.