Begin typing your search above and press return to search.

8 దేశాలు.. 3 సూపర్ స్టార్స్‌.. 1 సినిమా.. జనవరి 25

By:  Tupaki Desk   |   3 Dec 2022 3:30 AM GMT
8 దేశాలు.. 3 సూపర్ స్టార్స్‌.. 1 సినిమా.. జనవరి 25
X
బాలీవుడ్‌ గత కొన్నాళ్లుగా గడ్డు కాలంను ఎదుర్కొంటుంది. కరోనాకు ముందు కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నుండి ఏ సినిమా వచ్చినా కూడా జనాలు పెద్దగా పట్టించుకునే దాఖలాలు కనిపించడం లేదు. కానీ షారుఖ్ ఖాన్‌ నటించిన పఠాన్ సినిమా విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

జీరో సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న షారుఖ్ ఖాన్‌ తన పఠాన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ అన్నట్లుగా పేరు దక్కించుకున్న సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన పఠాన్ సినిమాను జనవరి 25వ తారీకున రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా గురించిన ఆసక్తికర విషయాన్ని యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. ఈ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలతో పాటు అత్యంత కీలకమైన పాటలు మరియు సన్నివేశాలను దేశ విదేశాల్లో చిత్రీకరణ చేయడం జరిగిందట. ఏకంగా 8 దేశాల్లో ఈ సినిమాను రూపొందించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

8 దేశాలు.. 3 సూపర్ స్టార్స్‌.. 1 సినిమా పఠాన్. ఈ సినిమాను స్పెయిన్‌.. యూఏఈ.. టర్కీ.. రష్యా.. ఇటలీ.. ప్రాన్స్‌.. ఇండియా.. అఫ్ఘనిస్తాన్‌ దేశాల్లో చిత్రీకరించాం. యశ్‌ రాజ్ ఫిల్మ్స్ యొక్క 50 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా పఠాన్ సినిమాను బిగ్‌ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. హిందీతో పాటు తెలుగు మరియు తమిళంలో కూడా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25వ తారీకున విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్‌ గా నటించగా కీలక పాత్రలో జాన్ అబ్రహం నటించారు. సినిమాలోని ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశంతో పాటు కమర్షియల్‌ సన్నివేశాలు మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంటాయని అంటున్నారు. దశాబ్ద కాలంగా సక్సెస్ లేక ఢీలా పడి ఉన్న షారుఖ్‌ కు ఈ సినిమా సక్సెస్ ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.