Begin typing your search above and press return to search.

వెబ్ వైపు కింగ్ ఖాన్ సీరియస్ చూపు

By:  Tupaki Desk   |   12 March 2019 1:30 AM GMT
వెబ్ వైపు కింగ్ ఖాన్ సీరియస్ చూపు
X
డిజిటిల్ ఎంటర్ టైన్మెంట్ కొత్త పుంతలు తొక్కుతోంది. వినోదం కోసం థియేటర్ దాకా వెళ్లనవసరం లేకుండా అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ తో అదరగొడుతున్నాయి. రానున్న రోజుల్లో కోట్లాది రూపాయలు వీటి మీద పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పుడు వీటికి మరింత ఊతమిస్తూ స్టార్ హీరోలు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ తో అమెజాన్ ది ఎండ్ అనే పేరుతో వెబ్ సిరీస్ షూటింగ్ ని ప్లాన్ చేసింది. దీని ఓపెనింగ్ ని కళ్ళు చెదిరే రీతిలో నిర్వహించి ఔరా అనిపించింది.

ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా సీరియస్ గా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటిదాకా తన రెడ్ చిల్లీస్ బ్యానర్ ద్వారా తాను హీరోగా నటించే సినిమాలను మాత్రమే నిర్మించిన షారుఖ్ మొన్న రిలీజ్ చేసిన బద్లాతో రూటు మార్చాడు. ఇప్పటికే పాజిటివ్ రిపోర్ట్స్ తో అది బాగానే దూసుకుపోతోంది .ఇటీవలే వెబ్ సిరీస్ లో షారుఖ్ ఆల్రెడీ కాలు పెట్టేశాడు. ఇమ్రాన్ అష్మి ప్రధాన పాత్రలో బార్డ్ అఫ్ బ్లడ్ అనే సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

ఇటీవలే లడఖ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని యూనిట్ రాజస్తాన్ కు వెళ్ళింది. ఇమ్రాన్ హాష్మి ఇందులో గూడచారి గా నటిస్తున్నాడు. ఇలాంటి మీడియం రేంజ్ హీరోలకే ఇంత మార్కెట్ ఉంటే కింగ్ ఖాన్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా. ఈ విషయంగానే నెట్ ఫ్లిక్స్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సెరాన్ డోస్ ప్రత్యేకంగా షారుఖ్ తో మీట్ అయ్యాడు. త్వరలో కింగ్ ఖాన్ ను వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ చేయాలనే ఆలోచన గురించి సీరియస్ గా చర్చించినట్టు సమాచారం. ఇదే కనక జరిగితే మరో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్టే