Begin typing your search above and press return to search.

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ పాన్ ఇండియా స్టార్ అయ్యే టైమ్‌ వచ్చిందా?

By:  Tupaki Desk   |   28 Jun 2021 3:30 AM GMT
సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ పాన్ ఇండియా స్టార్ అయ్యే టైమ్‌ వచ్చిందా?
X
సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఏదో కారణాల వల్ల గతంలో వచ్చిన బాలీవుడ్‌ ఆఫర్లను వదిలేసింది. కాని ఇప్పుడు ఈమె బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. తనకు తమిళంలో మంచి సక్సెస్‌ ను ఇచ్చిన అట్లీ కుమార్‌ తో నయన్‌ బాలీవుడ్‌ కు వెళ్లేందుకు సిద్దం అవుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అట్లీ కుమార్‌ దర్శకత్వంలో రాజారాణి సినిమా ను నయన్‌ చేసింది. బిగిల్‌ సినిమా లో కూడా నయన్‌ నే అట్లీ హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక త్వరలో తాను చేయబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కోసం కూడా ఆమెనే అట్లీ సంప్రదించాడనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించిన చర్చలు గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం షారుఖ్‌ చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే అట్లీ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. సోషల్‌ మెసేజ్ తో పాటు కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా కూడా ఈయన సినిమా ను తెరకెక్కిస్తాడనే నమ్మకంను షారుఖ్‌ పెట్టుకున్నాడు.

షారుఖ్‌ తో తాను తీయబోతున్న సినిమాకు గాను నయనతారను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అట్లీ కి నయన్‌ లక్కీ చామ్‌. అందుకే బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సమయంలో ఆమెను షారుఖ్‌ కు జోడీగా ఎంపిక చేయడంతో పాటు ఆయన్ను ఒప్పించాడు. ఈ సినిమా సక్సెస్‌ అయితే ఇప్పటికే సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న నయనతార ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోతుందేమో అంటూ తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.