Begin typing your search above and press return to search.

వాలకం చూసి జాతకం చెప్పేస్తా

By:  Tupaki Desk   |   5 Feb 2016 9:30 AM GMT
వాలకం చూసి జాతకం చెప్పేస్తా
X
నచ్చిన మగాడు ఎలా ఉండాలి? ఎలా ఉంటే మగాళ్లు నచ్చుతారు? ఇలాంటి ప్రశ్నలు అడిగితే.. ఏ అమ్మాయి అయినా సాధారణంగా చెప్పే సమాధానం ఒకటే ఉంటుంది. అందం లేకపోయినా మనసుండాలి, డబ్బు లేకపోయినా గుణం ఉండాలి, మంచోడయితే చాలు.. అమ్మాయిల నుంచి ఇవే ఆన్సర్స్ వస్తాయి. సౌత్ సుందరి శృతి హాసన్ కూడా ఇలాగే చెప్పింది కానీ.. కొంచెం తేడా అంతే. కాకపోతే ఈ భామ కళ్లతో చూసి జాతకం చెప్పేస్తానంటోంది.

మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారనే ప్రశ్నకు.. 'నేను మంచి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. అతనికి కనీసం కొంచెం అయినా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. రాక్ స్టార్ కాకపోయినా పర్లేదు కానీ.. మంచి మనసు చాలా ముఖ్యం. అదుంటే మిగతావాటిని తర్వాతైనా సెట్ చేసుకోవచ్చు.' అని చెప్పిన శృతి హాసన్ అక్కడితో ఆగలేదు. ఏకంగా.. వాళ్ల జాతకం కూడా పసిగట్టేస్తానని అంటోంది. దానికి కూడా ఈమె దగ్గర ఓ చిట్కా ఉందట.

'ఓ మగాడు నా గురించి ఏమనుకుంటున్నాడో తెలిసేందుకు ముందు అతని కళ్లు చూస్తా, తర్వాత గోళ్లు కూడా చూస్తా. గోళ్లు కొరుక్కునేవాళ్లు నాకు నచ్చరు. ఈ రెండింటి తర్వాత బాడీలాంగ్వేజ్ గమనిస్తాను. పద్ధతి ఉన్న వ్యక్తులకు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అతని గురించి నేను ఓ నిర్ణయానికి రావడానికి బాడీ లాంగ్వేజ్ ఓ కారణమవుతుంది' అని చెప్పింది శృతి హాసన్. ఏమైనా.. కళ్లూ, గోళ్లు చూసి మగాళ్లను డిసైడ్ చేసేస్తాననడం శృతిహాసన్ కే చెల్లింది.