Begin typing your search above and press return to search.
18 ఏళ్లకే శృతిని వేధించారట
By: Tupaki Desk | 19 Jan 2018 11:06 AM GMTకాస్టింగ్ కౌచ్ అనే మాట ఈమధ్య ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది. సినిమా పరిశ్రమలో రాణించాలనే అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలంటే ముందు వ్యక్తిగత సుఖం తీర్చాలనే బాడ్ కల్చర్ బాగా డెవలప్ అవుతోందనే మాటలను ఈమధ్య హీరోయిన్లు బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. కొంతమంది నటీమణులు అలాంటిదేం లేదని.. మహిళలపై వేధింపులు అన్నిచోట్లా ఉండేవేనని కొట్టిపారేస్తున్నా ఒక్కోసారి ఇది చర్చనీయాంశమే అవుతోంది.
కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడటంలో కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ ఒకడుగు ముందే ఉంటుంది. ఇంతవరకు తెలుగులో ఒక్క సినిమా కూడా నటించకపోయినా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కల్చర్ బాగా ఎక్కువ అంటూ ఆరోపణలు చేసిన ఈ భామ తాజాగా పబ్లిక్ ఈవెంట్లో తాను చిన్న వయసులోనే ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తనకు 18 ఏళ్ల వయసుండగానే తొలిసారి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేయాల్సి వచ్చిందని ఓపెన్ డయాస్ పై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. తరువాత తమిళ ఇండస్ర్టీలో కూడా ఒక సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఐదుగురు నిర్మాతలు తనను మార్చి మార్చి పంచుకుంటా అన్నారని.. వారి కోరిక తీర్చలేదని అసలు తమిళంలో సినిమాలే రావట్లేదని కూడా కామెంట్ చేసింది.
టాలీవుడ్ ఐటం సాంగుల స్పెషలిస్ట్ రాయ్ లక్ష్మీ కూడా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం బాగానే నడుస్తోందని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. తమిళ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఇదేతరహా కామెంట్స్ చేశారు.