Begin typing your search above and press return to search.
సై అంటే సై... రాజీకి నై...!
By: Tupaki Desk | 26 Oct 2018 10:08 AM GMTబాలీవుడ్ నటి తనుశ్రీ ఆరోపణల ద్వారా వేడిగా మారిన మీ టూ ఉద్యమం ప్రస్తుతం ఇండియాలో ఉదృతంగా కొనసాగుతోంది. పలువురు నటీమణులు, ఇతర టెక్నిషియన్ లు తమపై జరిగిన లైంగిక దాడులను బహిరంగ పర్చుతున్నారు. కన్నడ నటి శృతి హరిహరన్ స్టార్ హీరో అర్జున్ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ విషయంలో కొందరు శృతికి మద్దతు తెలపగా మరికొందరు అర్జున్ అలాంటి వాడు కాదని ఆరోపణలను కొట్టిపారేశారు. తాజాగా కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ అర్జున్ - శృతిల మద్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశాడు.
కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలిలో సభ్యుడు అయిన అంబరీష్ మీ టూ గొడవను ఇంతటితో ఆపాలని అర్జున్ - శృతిలకు నాలుగు మాటలతో సర్ధి చెప్పాలని ప్రయత్నించాడు. అందుకే తాజాగా ఈ ఇద్దరితో భేటి అయ్యి రాజీ కుదుర్చడానికి పూనుకున్నారు. కానీ రెబల్ స్టార్ అంబరీష్ రాజీ పూర్తిగా విఫలం అయినట్టు తాజా సమాచారం. అంబరీష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అర్జున్ - శృతిలు ఇద్దరు గట్టి పంతంతో ఉన్నారు - సై అంటే సై అంటున్నారు తప్పా ఈ వివాదానికి ఇంతటితో తెర వేసే ప్రయత్నం చేయడం లేదు. ఇద్దరు కూడా ఎలాంటి సాక్ష్యాధారాలను సమర్పించలేదు. ఈ విషయంలో న్యాయ పోరాటానికి అర్జున్ - శృతిలు సిద్దమయ్యారు.
రాజీ చర్చల్లో భాగంగా అంబరీష్ తో అర్జున్... నాపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అభిమానులు - కుటంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు, ఈ విషయంలో నాకు న్యాయం కావాలి - రాజీకి నేను ఒప్పుకోను, నేనేందుకు క్షమాపణలు చెప్పాలి - మీ టూ మహిళలకు మంచి వేదిక కానీ దాన్ని దుర్వినియోగం చేయడం బాదాకరం అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ... ఒక మహిళ ధైర్యంగా తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే సమాజంలో ఇంత వెటకారం ఎందుకు? నేను ఎందుకు క్షమాపణలు చెప్తా - నేనేం ఆయనపై కేసు వేయలేదు, ఈ విషయంపై ఆయన న్యాయ పోరాటానికి వెళ్లడం నాకు సంతోషంగానే ఉందని అంటోంది. ఇలా ఇద్దరు కూడా పంతానికి సై అంటే సై అంటున్నారు కానీ రాజీకి నై అంటున్నట్టుగా అంబరీష్ ప్రకటించారు.