Begin typing your search above and press return to search.

నేను చెక్కర - మీరు చీమలు : శృతి హరిహరన్‌

By:  Tupaki Desk   |   15 Nov 2018 11:50 AM GMT
నేను చెక్కర - మీరు చీమలు : శృతి హరిహరన్‌
X
కన్నడ స్టార్‌ హీరో అర్జున్‌ పై సంచలన లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన హీరోయిన్‌ శృతి హరిహరన్‌ ఏమాత్రం తన వాయిస్‌ ను తగ్గించడం లేదు. రాజీకి కూడా నో చెబుతున్న ఈమె లీగల్‌ గా ఎదుర్కొనేందుకు సిద్దం అంటోంది. తాజాగా ఈమె మహిళ కమీషన్‌ ముందు లాయర్‌ తో పాటు హాజరు అయ్యింది. ఈ సందర్బంగా మహిళా కమీషన్‌ అధ్యక్షురాలు నాగలక్ష్మీభాయి ముందు తన వాదనలు వినిపించింది. అర్జున్‌ తనపట్ల వ్యవహరించిన తీరు, ఆయన చేసిన లైంగిక వేదింపుల గురించి శృతి హరిహరన్‌ క్లీయర్‌ గా నాగలక్ష్మీభాయి కి వివరించినట్లుగా తెలుస్తోంది.

మహిళ కమీషన్‌ ముందు హాజరు అయిన సమయంలో శృతి హరిహరన్‌ తో మాట్లాడివ్వాలని మీడియా ప్రయత్నించారు. ఆ సమయంలో శృతి హరిహరన్‌ మరింత ఘాటుగా స్పందించింది. తాను సంజన మాదిరిగా పిరికిదాన్ని కాదు, నాకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా నేను మీటూ ఉద్యమంలో భాగంగా ముందుకు వెళ్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. సంజన మాదిరిగా నేను అస్సలు క్షమాపణ చెప్పను అంటూ తేల్చి చెప్పింది. ఇటీవలే సంజన దర్శకుడు రవికి క్షమాపణలు చెప్పడంపై శృతి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

ఈ సందర్బంగా మీడియాపై శృతి జోకులు వేసింది. మహిళ కమీషన్‌ వద్ద మీడియా వారు వేచి చూస్తున్న సమయంలో ఆమె నేను చెక్కరలా ఉన్నాను, మీరు చీమల వలే నా వెంట పడుతున్నారు అంటూ కామెంట్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ తన తప్పు గ్రహించి నాకు మీడియా అంటే గౌరవం, మీ గురించి నేను నేను ఏమీ అనలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే మీడియాను చీమలు అంటూ కామెంట్‌ చేయడంతో ఈమెపై మీడియా వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.