Begin typing your search above and press return to search.

శ్రుతిలోని క‌ళాత్మ‌క దృష్టికి ప్ర‌త్యేక‌త‌కు నిద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   8 Jun 2021 5:30 PM GMT
శ్రుతిలోని క‌ళాత్మ‌క దృష్టికి ప్ర‌త్యేక‌త‌కు నిద‌ర్శ‌నం
X
లాక్ డౌన్ స‌మ‌యంలో శ్రుతి విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో దోసెలు వేసినా.. ఫీల్డ్ లో క‌రాటే చేసినా.. చెలికాడు శంత‌నుతో స‌ర‌దాగా రొమాంటిక్ మూడ్ లో ఉన్నా.. ఏం చేసినా శ్రుతి హాస‌న్ లో ఉన్న జోష్ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఇంత‌కుముందుతో పోలిస్తే శ్రుతిలో ఇప్పుడు రెట్టించిన ఎన‌ర్జీ క‌నిపిస్తోంది.

గ‌త కొంత‌కాలంగా గోతిక్ మేక‌ప్ క‌ల్చ‌ర్ అంటూ విభిన్న‌మైన వేష‌ధార‌ణ‌ల‌తో మాంత్రికురాలి గెట‌ప్ తో ద‌ర్శ‌న‌మిచ్చి స‌ర్ ప్రైజ్ చేస్తోంది. మ‌రోవైపు ఇన్ స్టాలో చిలిపి ఆంటీ వేషాల‌తోనూ ఆక‌ట్టుకుంటోంది. టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ -2020 జాబితాలో నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని అలంక‌రించింది.

ఇక సోష‌ల్ మీడియాల్లో రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ శ్రుతి హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా షేర్ చేసిన క‌ళాత్మ‌క ఫోటోషూట్ ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. చెదిరిన కురులు.. య‌థాలాపంగా ఏదో సాలోచ‌న‌లోకి వెళ్లిపోయి ఒక స‌గ‌టు యువ‌తినే త‌లపిస్తోంది. ఎంతో అంద‌మైన‌ డిజైన‌ర్ బ్లాక్ ప‌ర్పుల్ శారీలో కాలి సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేస్తోంది. శ్రుతిలో క‌ళాత్మ‌క దృష్టికి ఇది సింబాలిక్. ఆస‌క్తిక‌రంగా ఇలాంటి క్రియేటివిటీ త‌న మైండ్ నుంచే పుట్టుకొస్తుంద‌ని శ్రుతి చాలా సార్లు తెలిపింది. ఇప్ప‌టికే వంద‌లాది ఫోటోషూట్ల‌కు త‌న‌కు తానుగానే కాన్సెప్ట్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.