Begin typing your search above and press return to search.

విమానాశ్ర‌యానికి షేక్ పుట్టించిన హాట్ క‌పుల్

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 AM GMT
విమానాశ్ర‌యానికి షేక్ పుట్టించిన హాట్ క‌పుల్
X
శృతి హాసన్ .. హాట్ లేడీ ఇన్ ది ఇండ‌స్ట్రీ. ఇటీవ‌ల‌ కొంత గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా ర‌చ్చ లేపుతోంది. ఇలా డిప్రెష‌న్ నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డిందో లేదో అలా త‌న కొత్త బోయ్ ఫ్రెండ్ ని ప‌రిచ‌యం చేసి చిలౌట్ చేస్తున్న తీరు స‌ర్వత్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం డూడుల్ ఆర్టిస్టు శంత‌ను లోకంగా బ‌తికేస్తోంది. అత‌డు లేని క్ష‌ణాన్ని శ్రుతి అస్స‌లు ఊహించుకోలేదు. అంత‌గా ఇటీవ‌ల ఈ జంట షికార్లు .. స‌ర‌సాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

శ్రుతి ఏం చేసినా ప్ర‌తిదీ ప‌బ్లిక్కే. ఎక్క‌డా దాప‌రికం అన్న‌దే ఉండ‌దు. ఇటీవ‌ల శంత‌ను ముందు గాల్లో ఎగిరి చంక‌నెక్కిన తీరు షాక్ కి గురి చేసింది. శంత‌నుకే మైండ్ బ్లాక్ అయ్యే ట్రీట్ ఇది. ఇప్పుడు విమానాశ్రయానికి వెళ్లే ముందు శంత‌నుతో హాయిగా ఫోటో దిగింది. అతన్ని ఉత్తమ సహచరుడు అని పొగిడేసింది.

శంత‌ను హజారికతో చాలాకాలం తర్వాత విమాన‌ ప్రయాణం చేస్తున్నందున ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు ముంబై ఎయిర్ పోర్టులో శంతనూతో కనిపించింది. వారు ఒకరినొక‌రు వీడ‌లేనంత చ‌నువుగా అక్క‌డ క‌నిపించారు. చాలా సంతోషంగా ప్ర‌యాణం ప్రారంభించారు.

విమానాశ్రయానికి బయలుదేరే ముందు శృతి హాసన్ శంత‌నుతో హాయిగా ఫోటోలు దిగి అతనికి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే నోట్ రాసింది. ఆమె ఏమ‌ని రాసింది? అంటే.. ఈ రోజు స్నేహితుల దినోత్స‌వం? శాంతను హజారిక ఆర్ట్ కి చాలా కృతజ్ఞతలు - ఒక అమ్మాయికి అత‌డు ఉత్తమ సహచరుడు. ఇక్కడ నవ్వడం తినడం కళను తయారు చేయడం అన్ని పిచ్చిగా ఉంటాయి.. అని శ్రుతి వెల్లడించింది. శృతి హాసన్ ఎయిర్ పోర్ట్ లుక్ లుక్ సంథింగ్ హాట్. బ్లాక్ లో ఆక‌ట్టుకుంది. స్వెట్ ష‌ర్ట్ కిట్టి స్లింగ్ బ్యాగ్ తో క‌నిపించింది. మరోవైపు శంత‌ను షార్ట్ లు పర్పుల్ టీలో సాధారణ లుక్ లో కనిపించాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రెండు బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు క్రాక్ - వకీల్ సాబ్ తో ట్రాక్ లోకి దూసుకొచ్చింది. KGF ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ స‌ర‌స‌న సలార్ లో న‌టిస్తోంది.