Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: శ్రుతిలో మెరుపు పెరిగింది
By: Tupaki Desk | 7 Aug 2015 12:49 PM GMTఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఛాయాచిత్రంలో ముద్దుగుమ్మ ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ రూపులో ఏం ఉంది? ఆ చూపులో ఏం కనిపిస్తోంది? ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? కోలమొహంపై సింపుల్ స్మయిల్ కనిపిస్తోంది. ఆ నడుము ఒంపులపై ఠీవిగా చేతులు వేసుకున్న తీరు తనలోని ధీమాని వ్యక్తం చేస్తోంది. అలా నిలబడి ఫోజులిస్తున్న తీరు చూస్తుంటే సక్సెస్ తో వచ్చిన గర్వం, దాంతో వచ్చిన కైపు కనిపిస్తోంది. వెరసి శ్రుతిహాసన్ అనే ముగ్ధ అని అర్థమవుతోంది.
అసలు శ్రుతిహాసన్ కెరీర్ ప్రారంభించినప్పుడు ఏమని అన్నారు? ఈవిడ అడుగు పెడితే ఐరెన్ లెగ్గు పెట్టినట్టే.. ఇక ఆ సినిమా పని అయిపోయినట్టే. ఆ నిర్మాత నెత్తిన చెంగేసుకుని వెళ్లిపోవాల్సిందే.. అనలేదూ? ... ఎస్.. ఇప్పటికీ ఆ మాటను పదే పదే గుర్తు చేసుకుంటూనే ఉంటుంది శ్రుతి. గబ్బర్ సింగ్ తో హిట్టొచ్చాక, మెగా హీరోలతో వరుస హిట్లొచ్చాక ఏమన్నారు?
అసలు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. శ్రుతిహాసన్ ఎగ్జాంపుల్. శ్రుతి నటిస్తే చాలు ఆ సినిమా హిట్టే. ప్రాజెక్టు లోకి వస్తే గోల్డెన్ లెగ్గు పెట్టినట్టే.. అంటూ పొగిడేయలేదూ? ఇది మనిషి లోకం. పతనంలో ఉంటే ఒకలా? సక్సెస్ లో ఉంటే ఇంకోలా చూస్తుంది. అందుకే ఈరోజు వరుస విజయాలు వచ్చినప్పుడు ఇలా చూపించకుండా ఉంటుందా? పోగొట్టుకున్నచోటే రాబట్టుకుంది. అందుకే ఇలా కనుబొమలెగరేస్తోంది. తాజాగా శ్రీమంతుడు తో హిట్టందుకుంది. ఆ సక్సెస్ వల్లే ఈ మెరుపులు.