Begin typing your search above and press return to search.

ఇలా కాపీ కొట్టే అలవాటేంటి శ్రుతీ?

By:  Tupaki Desk   |   8 Aug 2015 6:42 AM GMT
ఇలా కాపీ కొట్టే అలవాటేంటి శ్రుతీ?
X
ఇటీవలి కాలంలో కథలు కాపీ కొట్టేయడం, సినిమాల్లో సీన్లు కాపీ కొట్టేయడం గురించే మాట్లాడుకున్నాం. కానీ అందుకు డిఫరెంటుగా ఇక్కడ డ్రెస్సుల్లో డిజైన్‌ లు కాపీ గురించి ముచ్చటించాల్సొస్తోంది. ఒక స్టార్‌ హీరోయిన్‌ ధరించిన డిజైన్‌ ని వేరొక స్టార్‌ హీరోయిన్‌ కాపీ కొట్టేసి అవార్డుల వేడుకల్లో హల్‌ చల్‌ చేయడం జనాల్లో చర్చకొచ్చింది. ఇంకాస్తా డీటెయిల్స్‌ లోకి వెళితే..

గురు, శుక్రవారాల్లో దుబాయ్‌ లో సైమా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో శ్రుతిహాసన్‌ ఓ ప్రత్యేకమైన డ్రెస్‌ లో విచ్చేసింది. సరికొత్త డిజైన్‌ కోమల్‌ సూద్‌ గౌన్‌ లో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్‌ లో శ్రుతి అదరగొట్టేసిందంటూ ప్రశంసలొచ్చాయి. కట్‌ చేస్తే ఫ్యాషనిస్టులు ఆ డిజైన్‌ ఎక్కడిది? అని పరిశోధిస్తే అసలు విషయం తెలిసింది. అదే గౌన్‌ లో అంతకుముందు సంవత్సరం ధీక్షా సేత్‌ తన సినిమా 'లేఖర్‌ హమ్‌ దీవానా దిల్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొంది.

అయితే శ్రుతి ఇలా కాపీ కొట్టేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆలియాభట్‌ ధరించిన ఓ డిజైనర్‌ వేర్‌ ని కాపీ కొట్టేసి సైమా 2013 వేడుకల్లోనూ ఇలానే చేసింది. అలాగే సమంత ధరించిన ఓ డ్రెస్‌ ని యాజ్‌ ఇట్‌ ఈజ్‌ గా కాపీ కొట్టేసి ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో హల్‌ చల్‌ చేసింది. అయితే ఇలా కాపీ కొట్టేయాల్సిన పనేంటి? అని ఆరాతీస్తే.. ఒకరికి కాపీ అన్న చిన్నబోవడం తనకి అలవాటు లేదు. పైగా సదరు నాయికల డిజైనర్‌ లనే సంప్రదించి ఈ డ్రెస్సుల్ని డిజైన్‌ చేయించుకుంటోందని తెలిసింది. అదీ సంగతి.