Begin typing your search above and press return to search.
ప్చ్.. ఒక శృతి.. ఇద్దరు మినిష్టర్లు..
By: Tupaki Desk | 11 April 2015 7:30 PM GMTశృతిహాసన్ ఎపిసోడ్‌తో నాకు సంబంధం లేదని ఒక మినిష్టర్ స్టేట్‌మెంట్ ఇస్తే.. అబ్బే నేనసలు ఆమెను ఏమీ అనలేదు అంటూ మరో మినిష్టర్ సెలవిచ్చాడు. ఇంతకీ అసలు మన మంత్రులు శృతి గురించి ఏమంటున్నారు...
ముందుగా ఒక రూమర్ సారాంశం ఏంటంటే.. తిరుపతి వెళ్లే విమానంలో తన పక్కనే ఉన్న శృతిహాసన్‌తో ఓ ఫోన్ కాల్ విషయంలో గొడవపడిన ఒక మంత్రి ఆమెను తిట్టారట. దానితో ఆమె ఏడ్చేసిందని.. ఫేస్‌బుక్‌లో న్యూస్. అయితే ఇదంతా నిజం కాదని, అసలు తనుకు శృతిహాసన్ ఎవరో కూడా తెలియదని ఆరోగ్యా శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సెలవిచ్చారు. కాని ఈయన రిటర్న్ ఫ్లయిట్‌లో శృతితో కలసి ప్రయాణం చేశారు. అసలు తిరుపతికి వచ్చే ఫ్లయిట్‌లో ఉంది వేరే మంత్రట. సరిగ్గా ఆ డౌట్లు వస్తున్న టైములో దేవదాయా శాఖామాత్యులు పైడికొండల మాణిక్యాలరావు లైన్‌లోకి వచ్చారు.
''అవును, శృతి నా ముందు సీట్లో కూర్చుంది. నేను ఓ డాక్టర్‌తో అర్జెంటుగా మాట్లాడాల్సి రావడంతో, ఫ్లయిట్ గాల్లో ఉన్నప్పుడే కాల్ చేశాను. అలా చేయకూడదని శృతి చెప్పడంతో, ఆమెకూ ఎయిర్ హోస్టెస్‌కూ విషయం వివరించా.. అంతేకాని శృతి మీద అరవలేదు. ఆమె ఏడవలేదు. మీరు వింటున్నవన్నీ దుష్ప్రచారాలు'' అంటూ సెలవిచ్చారు.