Begin typing your search above and press return to search.
శ్రుతి పెళ్లి చేసుకోదట
By: Tupaki Desk | 9 July 2015 3:30 PM GMTకథానాయికలు ప్రేమ కబుర్లతోనే కాదు, ఉన్నట్టుండి పెళ్లి కబుర్లు కూడా వినిపించేసి ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. 'మీకు తెలియదు కానీ.. మాది పదేళ్ల ప్రేమబంధం. ఇప్పుడు పెళ్లి చేసుకొంటున్నాం' అని కాబోయేవాడిని పరిచయం చేస్తుంటారు. అలా హఠాత్తుగా పెళ్లి కబురు వినిపించేసి కుర్రాళ్ల గుండెల్ని బద్దలు చేసిన కథానాయికలు మనకు చాలా మందే కనిపిస్తారు. అయితే శ్రుతిహాసన్ మాత్రం 'మీరు నమ్మండి, నమ్మకపోండి. నాకైతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు' అని చెబుతోంది. అందరూ ఇలాగే చెప్తార్లేమ్మా అంటే... ''అందరిలాంటి అమ్మాయిని కాదు నేను. నాకంటూ కొన్ని స్వతంత్రమైన భావాలున్నాయి. వాటికి అనుగుణంగానే నడుచుకొంటా'' అంటోంది శ్రుతి.
ఇంతకీ పెళ్లెందుకు చేసుకోకూడదని ఫిక్సయ్యారని అడిగితే.. ''ఎందుకో తెలియదు కానీ... ఇప్పటిదాకా పెళ్లి ఆలోచనే నాకు రాలేదు. అందుకే నేను బ్రహ్మచారిణిగా ఉండిపోతానేమో అనిపిస్తుంటుంద''ని కిలకిలా నవ్వేస్తోంది. మీ అమ్మానాన్నల జీవితాల్ని చూసే ఇలాంటి నిర్ణయం తీసుకొన్నారా? అని అడిగితే... ''మా అమ్మానాన్నల జీవితాల ప్రభావం మాపై ఏమాత్రం లేదు. వాళ్లలా పెంచారు మమ్మల్ని. కెరీర్, పెళ్లిలాంటివి ఎవరికి వారు సొంతంగా తీసుకొనే నిర్ణయాలు. నా వరకు ఇప్పటికి పెళ్లి చేసుకోకూడదనే ఉంది. ఇక రేప్పొద్దున ఏం జరుగుతుందో నేను చెప్పలేను'' అని సెలవిస్తోంది శ్రుతి.