Begin typing your search above and press return to search.

బెడ్‌ పై ప్రియుడితో శృతిహాసన్‌ వీడియో వైరల్‌

By:  Tupaki Desk   |   5 March 2022 6:39 AM GMT
బెడ్‌ పై ప్రియుడితో శృతిహాసన్‌ వీడియో వైరల్‌
X
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ నట వారసురాలు శృతి హాసన్‌ నార్త్‌ సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇప్పుడు ఆమె కమల్‌ కూతురుగా కాకుండా సొంత ఇమేజ్ తో కెరీర్‌ ను బిల్డ్ చేసుకుంటూ స్టార్‌ గా దూసుకు పోతుంది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన శృతి హాసన్ ఇండియాలో ఉన్నా కూడా విదేశీ సంస్కృతిని ఫాలో అవుతూ ఉంటుంది. పూర్తిగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తన జీవితాన్ని గడిపే స్వభావం ఆమెది.

గతంలో విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి మునిగి తేలిన శృతి హాసన్‌ అతడి నుండి విడిపోయినట్లుగా చాలా సింపుల్ గా చెప్పేసింది. ఇద్దరం కూడా కెరీర్‌ లో చాలా సాధించాలి అనుకుంటున్నాం. అందుకు ఈ రిలేషన్‌ షిప్ లు అడ్డుగా ఉన్నాయని చెప్పి బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ అమ్మడు శాంతను హజారికా తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు సుదీర్ఘ కాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.

ఆ వార్తలు నిజమేనేమో అంటూ తాజాగా ఆమె షేర్‌ చేసిన ఒక వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా శృతి హాసన్‌ కరోనా తో బాధపడుతుంది. కరోనా వల్ల ఆమె కాస్త సీరియస్ గానే ఎఫెక్ట్‌ అయ్యింది. ఆమె మొహం కాస్త షేప్ మారినట్లుగా కూడా ఆమె షేర్‌ చేసిన ఫోటోలు చూస్తే అనిపించింది. తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్‌ లో స్టోరీ గా పెట్టిన వీడియో ప్రియుడితో ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తుందో చెప్పకనే చెబుతోంది.

కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన ఈ అమ్మడు తాజాగా ప్రియుడితో ఒకే బెడ్‌ మీద ఉన్న వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియో లో ఇద్దరు కూడా చాలా సరదాగా సమయం ను గడుపుతున్నారు. ఇద్దరు కలిసి ఆనందకరమైన సమయంను ఈ సమయంలో గడుపుతున్నారు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. శృతి హాసన్‌ పెళ్లి పై ఆసక్తి లేదు అన్నట్లుగా గతంలో మాట్లాడినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. మొత్తానికి శృతి షేర్‌ చేసిన ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

కనుక శృతి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న శాంతను హజారి ని కూడా పెళ్లి చేసుకోక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతానికి ఒక మంచి స్నేహితుడు అంటూ మీడియా కు పరిచయం చేస్తున్న శాంతను ను త్వరలోనే ప్రియుడు అంటూ శృతి హాసన్‌ పరిచయం చేస్తుందేమో చూడాలి. ఈ వీడియో తో తమ ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది అంటూ శృతి చెప్పకనే చెప్పిందేమో అనిపిస్తుంది.