Begin typing your search above and press return to search.

ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి శిష్యుడి డైరెక్ష‌న్‌లో '1770'!

By:  Tupaki Desk   |   17 Aug 2022 9:31 AM GMT
ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి శిష్యుడి డైరెక్ష‌న్‌లో 1770!
X
తెలుగులో దేశ భ‌క్తి చిత్రాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న మ‌రో దేశ భ‌క్తి ప్ర‌ధాన మూవీ '1770'. ప్ర‌ముఖ బెంగాళీ ర‌చ‌యిత బంకించంద్ర ఛ‌ట‌ర్జీ ర‌చించిన ఆనంద‌మ‌ఠ్ అనే న‌వ‌ల ఆధారంగా ర‌చించిన వందేమాత‌ర గీతాన్ని మ‌న జాతీయ గీతంగా ఆల‌పిస్తున్నాం. ఆ పాట రాసి దాదాపు 150 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా దానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ని నిర్మాత‌లు శైలేంద్ర కుమార్‌, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్‌. బి, సూర‌జ్ శ‌ర్మ బుధ‌వారం విడుద‌ల చేశారు.

భార‌త దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 వ‌సంతాలు అవుతున్న సంద‌ర్భంగా స్వ‌తంత్ర భార వ‌జ్రోత్స‌వాల‌ను యావ‌త్ దేశం మొత్తం ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు శైలేంద్ర కుమార్‌, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్‌. బి, సూర‌జ్ శ‌ర్మ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ గా '1770'ని బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఎస్ ఎస్ 1 ఎంట‌ర్ టైన్ మెంట్, పీకె ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ ల‌పై బ‌హు భాష చిత్రంగా ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

బంకించంద్ర ఛ‌ట‌ర్జీ ర‌చించిన ఆనంద‌మ‌ఠ్ అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వ‌ద్ద ఆగ‌, బాహుబ‌లి వంటి బారీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అశ్విన్ గంగారాజు ఇటీవ‌ల విడుద‌లైన 'ఆకాశ‌వాణి' మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఇది అత‌ని రెండ‌వ సినిమా. మొత్తం ఆరు భాష‌ల్లో ఈ మూవీని విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఈ భారీ చిత్రానికి వి. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ 'ఇది నాకు బిగ్ ఛాలెంజింగ్ స‌బ్జెక్ట్‌. అయితే లెజెండ‌రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ గారు క‌థ‌, స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ను మాత్ర‌మే నేను తెర‌కెక్కించాలి. అద్భుత‌మైన పీరియాడిక్ సెట్స్‌, అద్భుత‌మైన ఎమోష‌న్స్‌.. లార్జ‌ర్ దెన్ లైఫ్ యాక్ష‌న్ త‌దిత‌ర వున్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ముందు కంగారు ప‌డినా రామ్ క‌మ‌ల్ గారితో మాట్లాడాక నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది' అన్నారు.

1770 లో భార‌త స్వాతంత్య్ర‌ స‌మ‌రం కోసం మ‌న‌లో స్ఫూర్తిని ర‌గిల్చిన యోధులెంద‌రో వున్నారు. వారి గురించి తెలియ‌జేసే చిత్ర‌మే ఇది అని విజ‌యేంద్ర ప్ర‌సాద్ తెలిపారు. తెలుగు, త‌మిళ‌, మ‌లయాళ‌, క‌న్న‌డ‌, హిందీ, బెంగాలీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ మూవీలోని ప్ర‌ధాన పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌న్న‌ది ద‌స‌రా స‌మ‌యంలో ప్ర‌క‌టిస్తార‌ట‌. అంతే కాకుండా టీమ్ కు సంబందించిన పూర్తి వివ‌రాల‌ని దీపావ‌ళికి వెల్ల‌డించ‌నున్నార‌ట‌.