Begin typing your search above and press return to search.
జక్కన్న సుపుత్ర క్రీడల్లో పెట్టుబడి
By: Tupaki Desk | 4 Sep 2018 4:50 AM GMTటాలీవుడ్ - బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో సెలబ్రిటీలు క్రీడల్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ మాయలో పడి ఎన్నో సాంప్రదాయక క్రీడలు అదృశ్యం అయిపోతున్నాయి. కబడ్డీ - కోకో - వాలీబాల్ వంటి పల్లెపట్టు క్రీడల్ని కాలక్రమంలో మర్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే సరిగ్గా అలాంటి టైమ్ లో ఈ క్రీడలకు గ్లామర్ ని అద్ది - వాటికి బుల్లితెరపై విస్తృతంగా ప్రమోట్ చేసేందుకు కార్పొరెట్ ముందుకు రావడం - వాళ్లతో భాగస్వాములుగా మారి మన హీరోలు ప్రచారం చేయడం కలిసొచ్చింది. నేడు కబడ్డీ ఆటకు ఉన్న ప్రాచుర్యం వేరొక క్రీడకు లేదంటే అదంతా బుల్లితెరపై టోర్నీల లైవ్ పుణ్యమే. కబడ్డీ ఆటకు రానా - అభిషేక్ బచ్చన్ వంటి స్టార్లు కావాల్సినంత ప్రచారం తెచ్చిపెట్టారు. ఆయా టోర్నీల్లో వీళ్ల ముఖాలు చూసి పల్లెటూరి యువత మర్చిపోయిన కబడ్డీ ఆటపై మరింత మక్కువ పెంచుకున్నారు. ఇది చెప్పుకోదగ్గ పాజిటివ్ ఛేంజోవర్. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రేసింగ్ వంటి క్రీడల పైనా మక్కువ చూపిస్తారన్న సంగతి తెలిసిందే. అలానే టాలీవుడ్‌లో పలువురు నిర్మాతలు ఖరీదైన గోల్ఫ్ క్రీడలకు ప్రాచుర్యం తెచ్చారు అప్పట్లో.
ఇక పలువురు హీరోలు బాలీవుడ్ స్టార్లతో కలిసి క్రికెట్ - కబడ్డీ పలు క్రీడల్లో పెట్టుబడులు పెట్టారు. సీసీఎల్ తరహా క్రికెట్ టీమ్ లపైనా సైలెంటుగా పెట్టుబడులు పెట్టారన్న ప్రచారం సాగింది. వెంకీ - నాగార్జున - శ్రీకాంత్ - తరుణ్ లాంటి స్టార్లు క్రికెట్ పై చూపించే మక్కువ తక్కువేమీ కాదు. బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సైతం క్రీడాభిమాని. ఆయన క్రీడల్ని - నవతరం క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తారు. సామాజిక మాధ్యమాల్లోనూ విస్త్రత ప్రచారం కల్పిస్తుంటారు. క్రికెట్ లో ఇండియాకి బోలెడంత సపోర్టర్.
ఇప్పుడు ఆయన వారసుడు కార్తికేయ కబడ్డీకి ప్రమోషన్ చేయడం ఫిలింవర్గాలు సహా కామన్ జనాల్లో చర్చకొచ్చింది. రాజమౌళి సంస్థానంలో అన్ని భారీ చిత్రాలకు కీలకమైన విభాగాల్ని హ్యాండిల్ చేసే కార్తికేయ - ప్రస్తుతం వేరొక బాధ్యతను తీసుకున్నారు. ప్రఖ్యాత నిర్మాత - రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటితో కలిసి కబడ్డీ టీమ్ పై పెట్టుబడులు పెడుతున్నాడట. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న `తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ` ఆటకు ప్రాచుర్యం తెచ్చేందుకు నల్గొండ ఈగిల్స్ టీమ్ తరపున ప్రచారానికి దిగుతున్నారని తెలిసింది. ఈ టీమ్ కి వెనక ఉండి కథ నడిపించేది కార్తికేయ, కొర్రపాటి అని తెలుస్తోంది. ఇక కార్తికేయ ఇతర స్టార్ హీరోల తరహాలోనే ఎంటర్ ప్రెన్యూర్ గా పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదివరకూ రెస్టారెంట్ బిజినెస్ - సినిమాల నిర్మాణంలోనూ అనుభవం ఘడించాడు. మొత్తానికి యువ కార్తికేయ ఎందరికో స్ఫూర్తి నింపుతుండడం ఫిలింనగర్ వర్గాల్లో చర్చకొచ్చింది.