Begin typing your search above and press return to search.
బాహుబలి చేస్తూ పెరిగాడట
By: Tupaki Desk | 26 April 2017 4:48 AM GMTబాహుబలి ప్రాజెక్ట్ ఓ సుదీర్ఘ ప్రయాణం అనే సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి ఇంత క్రేజ్ వచ్చిందంటే.. దాని వెనక కొన్ని సంవత్సరాల ప్రయాణం ఉంది. నిర్మాణం ప్రారంభమయ్యాక నాలుగేళ్లకు పైగా ఈ ప్రాజెక్ట్ సమయం తీసుకుందనే విషయం తెలిసిందే కానీ.. అసలీ ప్రాజెక్ట్ పనులు మొదలైనప్పటి నుంచి ఆరేళ్లకు పైగా కాలాన్ని బాహుబలి కోసం వెచ్చించారు బాహుబలి అండ్ టీం.
'బాహుబలి ప్రయాణం నా జీవితంలో చాలా కీలకం. ఈ ప్రాజెక్ట్ పనులు మొదలైనపుడు నా వయసు 19 ఏళ్ల పిల్లాడిని. ఇప్పుడు 26 ఏళ్ల యువకుడిని. అంటే నా లైఫ్ లో కీలకమైన వయసును బాహుబలితోనే గడిపాను. ఓ వ్యక్తి నమ్మకానికి ఇది సిసలైన పరీక్ష. మా మధ్య ఎన్నో అనుబంధాలను కూడా ఈ చిత్రం నెలకొల్పింది. నిర్మాత శోభు యార్లగడ్డ లేకపోతే ఇంతటి కల తీరేది కాదు. మొదటి భాగం విడుదల సమయంలో తొలి రెండు రోజులు టాక్ తేడా వచ్చినపుడు.. ఆయన ఒక్కరే నమ్మకంగా నిలవగలిగారు. ఆయన నమ్మకమే ఈ చిత్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది' అంటూ బాహుబలి ప్రయాణంపై వివరించాడు ఎస్ ఎస్ కార్తికేయ.
'వల్లి పిన్ని చూపించిన పట్టుదల అమోఘం. ఎప్పటికప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంది. ఊహలను వాస్తవం చేసేందుకు ఆకాశమే హద్దు అనేందుకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనం.. బాబా- అమ్మా-మయూ.. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ప్రయాణాన్ని మీతో కలిసి షేర్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ' అన్నాడు కార్తికేయ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/