Begin typing your search above and press return to search.

#బంగారం సేస్ ఎస్ ఎస్: దీనర్థం ఏంటి బంగారం?

By:  Tupaki Desk   |   29 Dec 2018 5:03 AM GMT
#బంగారం సేస్ ఎస్ ఎస్: దీనర్థం ఏంటి బంగారం?
X
రాజమౌళి తనయుడు కార్తికేయ..జగపతి బాబు అన్నయ్య కూతురు పూజా ప్రసాద్ వివాహం జైపూర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వివాహం రేపే అయినా వివాహం ముందు జరిగే కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. టాలీవుడ్ నుండి చాలామంది సెలబ్ ఫ్యామిలీస్ ఇప్పటికే జైపూర్ లోని ఫెయిర్ మాంట్ హోటల్ కు చేరుకున్నాయి.

ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ట్విట్టర్ లో చరణ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ #బంగారం సేస్ ఎస్ఎస్(#BangaramSaysSS)అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. ఉపాసన మాత్రమే కాదు కార్తికేయ-పూజ ల వెడ్డింగ్ కు హాజరైన మరికొంత మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియా లో సేమ్ హ్యాష్ టాగ్ ను వాడడంతో అసలు ఈ కొత్త వాక్యానికి అర్ధం తెలియక నెటిజనులు అయోమయంలో పడిపోయారు.

ఇంతకీ సంగతి ఆ హ్యాష్ టాగ్ అర్థం ఏంటంటే పూజను కార్తికేయ ప్రేమగా 'బంగారం' అని పిలుస్తాడట. పూజ మాత్రం కార్తికేయను 'ఎస్ ఎస్' అని పిలుస్తుందట.. 'బంగారం సేస్ ఎస్ఎస్'. అంది సంగతి ఇక మీరు కూడా కార్తికేయ-పూజ పెళ్ళి సంగతి సోషల్ మీడియా లో పంచుకునే పక్షంలో ఈ #బంగారం సేస్ ఎస్ఎస్ ను జోడించి ట్రెండ్ ను ఫాలో అయిపోండి.