Begin typing your search above and press return to search.
అవమానించిన చోటే రాజమౌళికి అవార్డిచ్చారు
By: Tupaki Desk | 26 May 2020 7:30 AM GMTబాహుబలితో రాజమౌళి ప్రతిభ విశ్వవ్యాప్తం అయ్యింది. రాజమౌళి ఏ సినిమా తీసినా అందులో తన మొత్తం ఫ్యామిలీ ఇన్ వాల్వ్ అవుతుంటుంది. రాజమౌళి సాధించిన విజయాల్లో ఆయన భార్య రమది కీలకపాత్ర అన్న విషయం మనకు తెలిసిందే.. మగధీర, బాహుబలి వంటి చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
రాజమౌళి దర్శకుడు కాకముందు తనకు ఎదురైన అవమానం గురించి చైన్నైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మూడేళ్ల క్రితం పంచుకున్నారు. ఆ వీడియో తిరిగి తిరిగి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది. అందులో తనను అవమానంచిన సంస్థ చేతుల మీదుగానే అవార్డు అందుకున్నానని తెలిపి రాజమౌళి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
చైన్నైలో జరిగిన బీహైండ్ ఉడ్స్ అవార్డు ల కార్యక్రమంలో రాజమౌళి పాల్గొన్నాడు. ‘గోల్డ్ మెడల్ ఫర్ ది విజినరీ ఆఫ్ ఇండియా సినిమా ’ అనే అవార్డును రాజమౌళి అందుకున్నాడు. ఈ సందర్భంగా రాజమౌళిని ప్రఖ్యాత దర్శకుడు ఎస్పీ పుత్తురామన్ చేతుల మీదుగా సత్కరించారు.
ఈ అవార్డు అందుకోవడానికి రాజమౌళిని సతీసమేతంగా రావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. అవార్డు తీసుకోవడానికి రాజమౌళి పేరు ప్రకటించగానే సభకు వచ్చిన ప్రేక్షకులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో రాజమౌళిని ఆహ్వానించారు.. అవార్డు అందుకున్న తర్వాత రాజమౌళి దంపతులు ర్యాంప్ పై నడిచి అలరించారు. దీనికి సభకు వచ్చిన ప్రేక్షకులు కేకలు, ఈలలతో హోరెత్తించారు.
అవార్డు తీసుకున్న అనంతరం రాజమౌళి నాడు ఎమోషనల్ స్పీచ్ చేశాడు. ‘దర్శకుడిని కాకముందు ఇదే ఏవీఎం స్టూడియో ఎదుట తనకు అవమానం జరిగింది. నా జీవితంలో తొలిసారి ఏవీఎం స్టూడియోకు వచ్చాను. అటూ ఇటూ చూస్తూ ఏవీఎం స్టూడియోలోకి అడుగుపెడుతుండగా.. గేట్ కీపర్ ఆపాడు. పోనివ్వలేదు. అలాంటి చోటనే ఏవీఎం అధినేత పేరుతో అవార్డును అందుకోవడం గర్వంగా ఉందని’ రాజమౌళి ఉద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఈ మాట అనగానే సభ చప్పట్లతో మారుమోగింది. ఆ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళికి జరిగిన అవమానం సంగతి తెలిసివచ్చింది. రాళ్లేసిన చోట పూలు పడడం అంటే ఇదేనేమో..